Family Time: ‘రాఖీభాయ్’ క్యూటెస్ట్ ఫ్యామిలీ.. ఫొటో వైరల్!
హీరో యష్ టైటిల్ రోల్ లో నటించిన కేజీఎఫ్ చాఫర్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తోంది.
- By Balu J Published Date - 04:38 PM, Tue - 19 April 22
హీరో యష్ టైటిల్ రోల్ లో నటించిన కేజీఎఫ్ చాఫర్టర్ 2 ఏప్రిల్ 14న విడుదలై, ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తోంది. ఈ చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత యష్ తన పిల్లలు ఐరా, యథార్వ్, భార్య రాధిక పండిట్‌తో కలిసి బీచ్‌లో సరాదాగా గడిపారు. ఫ్యామిలీ ఫొటోను భార్య రాధిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. యష్, రాధిక పండిట్ తమ పిల్లలతో ఇసుకతో ఆడుకోవడం ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోకు మూడు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. అభిమానులు యష్ కుటుంబం పట్ల అమితమైన ప్రేమను కురిపించారు. “Soooooooooo పూజ్యమైన #Rockingfamily” అని కొందరు, “క్యూటెస్ట్ ఫ్యామిలీ వావ్” అని మరికొందరు కామెంట్స్ చేశారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుని మంచి రన్‌తో దూసుకుపోతోంది. రాకింగ్ స్టార్ యశ్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన కేజీయఫ్ చాప్టర్ 1 సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్ల వద్ద బారులు తీరారు. థియేటర్లలో రాఖీ భాయ్ వయోలెన్స్‌కు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. ఈ సినిమాలోని హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. దెబ్బకు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ.. ఏ భాషలో చూసినా కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది. రాఖీ భాయ్ గత రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ పోతున్నాడు.
Related News
Padamati Kondallo: ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్
Padamati Kondallo: సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘ఎక్స్’ వేదికగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ పై విన్విత ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ ద్వారా జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా ఈ ‘పడమటి కొండల్లో’ చిత్ర నిర్మాణం జరిగింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నరేష్ పెంట, సంగీతాన్ని కూడా అందించారు. అనురోప్ కటారి హీరో గా నటిస్తున్న ఈ ‘పడమటి కొండ