యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు తీసుకోవాలి అనుకుంటున్నారా..ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే?
- By Nakshatra Published Date - 10:00 AM, Tue - 21 June 22
మామూలుగా మనం క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుల పేర్లు వింటూ ఉంటాం అలాగే తరచుగా వాటిని మనం ఉపయోగిస్తుంటాం. కానీ యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు అంటే చాలామందికి తెలియక పోగా అదేదో కొత్తరకం కార్డు అని అనుకుంటూ ఉంటారు. క్రెడిట్ కార్డు కు అనుబంధంగా మరొక క్రెడిట్ కార్డ్ ను తీసుకుంటే దానిని యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ అని అంటారు. అయితే ఈ కార్డుల విషయంలో చెల్లింపు బాధ్యత అనేది ప్రాథమిక కార్డు హోల్డర్ పై ఆధారపడి ఉంటుంది. ఇక ఇదే విషయాన్ని కార్డు హోల్డర్ కు తెలియజేయాలని స్పష్టమైన అవగాహనతో కార్డులను జారీ చేయాలి అని గతంలోనే ఆర్.బి.ఐ కార్డు జారీ సంస్థలకు సూచించిన విషయం తెలిసిందే. మరి ఈ కార్డు దీని కోసం దీనిని ఎవరు తీసుకోవచ్చు? ఎలా తీసుకోవాలి?ఎలా తీసుకోవాలి?ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..
యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు అంటే ఇప్పటికే ప్రైమరీ క్రెడిట్ కార్డు తీసుకున్న వారు అదనంగా మరో కార్డ్ తీసుకోవడాన్ని యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ లేదా సప్లిమెంటరీ క్రెడిట్ కార్డ్ అని కూడా అంటారు. అయితే వ్యక్తిగత క్రెడిట్ కార్డులను అందిస్తున్న చాలా వరకు సంస్థలు యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్నీ అందిస్తున్నాయి.
ఇక ఎవరు తీసుకోవచ్చు అన్న విషయానికి వస్తే ఈ కార్డులు ఆదాయ మార్గం లేని వారికి మాత్రమే ఉపయోగపడతాయి. ఇందులో ఆదాయం లేని కుటుంబ సభ్యులు కోసం ఈ యాడ్ ఆన్ కార్డు ను తీసుకోవచ్చు.
ఎన్ని కార్డులు తీసుకోవచ్చు అన్న విషయానికి వస్తే కార్డు జారీ సంస్థలు ప్రాథమిక కార్డు పై రెండు లేదా మూడు పరిమిత సంఖ్యలో యాడ్ ఆన్ కార్డులను జారీ చేస్తాయి. ఇదంతా కూడా మీ కార్డు జారీ చేసిన సంస్థ పై ఆధారపడి ఉంటుంది.
Tags
Related News
Credit Card: క్రెడిట్ కార్డు తీసుకోవాలని చూస్తున్నారా..? అయితే ఈ తప్పులు చేయకండి..!
దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎంతగా పెరిగిపోయిందంటే సామాన్యుడు బతకడం చాలా కష్టంగా మారింది. ఈ రోజుల్లో ప్రజలు మెరుగైన జీవనశైలిని గడపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.