Satya Raj: కట్టప్పకు కరోనా పాజిటివ్!
- Author : Balu J
Date : 08-01-2022 - 12:01 IST
Published By : Hashtagu Telugu Desk
సినీ ఇండస్ట్రీపై కరోనా మహమ్మారి దండయాత్ర చేస్తోంది. మహేశ్ బాబు, త్రిష, మంచు లక్ష్మీ, థమన్ లాంటి వాళ్లు కరోనా బారిన పడగా, తాజాగా బాహుబలి ఫేం కట్టప్ప అయిన యాక్టర్ సత్యరాజ్ కొవిడ్ పాజిటివ్ అని తేలింది. శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆయన్ని చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. మాస్క్ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పాక్షిక లాక్ డౌన్ అమలు చేసే అవకాశాలున్నాయి. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.