Accident : బెంగుళూరు విమానాశ్రయంలో పిల్లర్‌ని ఢీకొట్టిన బస్సు.. 10 మందికి గాయాలు
బెంగళూరు విమానాశ్రయంలో షటిల్ బస్సు పిల్లర్‌ను ఢీకోట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలైయ్యాయి. కెంపేగౌడ
- By Prasad Published Date - 07:43 AM, Mon - 19 June 23

బెంగళూరు విమానాశ్రయంలో షటిల్ బస్సు పిల్లర్‌ను ఢీకోట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలైయ్యాయి. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2 వరకు ప్రయాణిస్తున్న షటిల్ బస్సు ఆదివారం తెల్లవారుజామున పిల్లర్‌ను ఢీకొనడంతో పది మంది గాయపడ్డారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురు డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.