Abhay Prabhavana Museum: పుణేలో మొదలైన అభయ్ ప్రభవన మ్యూజియం
భారతీయ విలువలు మరియు జైన సంప్రదాయాల సమ్మేళనంతో పుణేలో ప్రారంభమైన అభయ్ ప్రభవన్ మ్యూజియం, వివిధ సంస్కృతులను చాటి చెప్పే ప్రత్యేకమైన ప్రదర్శన స్థలంగా నిలుస్తోంది.
- By Kode Mohan Sai Published Date - 01:27 PM, Wed - 6 November 24

జైన తత్వశాస్త్రం మరియు భారతీయ వారసత్వం యొక్క గొప్పదనాన్ని ప్రతిబింబిస్తూ అభయ్ ప్రభవన మ్యూజియాన్ని పుణెలో నెలకొల్పారు. ప్రస్తుతం ఈ మ్యూజియాన్ని ‘మ్యూజియం ఆఫ్ ఐడియాస్’ గా అభివర్ణిస్తున్నారు. ఈ అభయ్ ప్రభవన మ్యూజియాన్ని అమర్ ప్రేరణ ట్రస్ట్ ఛైర్మన్ గౌరవనీయులు శ్రీ అభయ్ ఫిరోదియా స్థాపించారు. ఈ మ్యూజియానికి ఆయనే వ్యవస్థాపకుడు కూడా. ఈ మ్యూజియం ఏర్పాటు ద్వారా భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షించడంలో మరియు ప్రచారం చేయడంలో ఒక కీలకమైన మైలురాయిని ఇది సూచిస్తుంది. ఈ అద్బుతమైన కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు, సాహితీవేత్తలు, చరిత్రకారులు హాజరయ్యారు. భారతీయ వ్యవస్థలో జైన మత విలువలు చూపిన ఔచిత్యం గురించి లోతైన అవగాహన కల్పించడమే ఈ మ్యూజియం ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నితిన్ గడ్కరీ గారు, కేంద్ర మంత్రివర్యులు మరియు గ్వాలియర్ మహారాజా అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా హాజరయ్యారు. హేగ్‌లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ దల్వీర్ భండారీ ఈ వేడుకకు అధ్యక్షత వహించారు. వీరితోపాటు మేవార్ మహారాజు శ్రీ కుమార్ లక్ష్యరాజ్ సింగ్ గారు, బీఎమ్వీఎస్ఎస్ వ్యవస్థాపకులు పద్మ భూషణ్ డీఆర్ మెహతా గారు, గాంధేయ వాది పద్మభూషణ్ అన్నా హజారే గారు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. మరోవైపు కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) గౌరవనీయులు శ్రీమతి మేనకా గాంధీ గారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు ఆధ్యాత్మిక వేత్తలు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని మరింత శోభాయమానంగా మార్చారు. పద్మశ్రీ గురుదేవశ్రీ రాకేష్ జీ గారు (ధరంపూర్), పద్మశ్రీ ఆచార్య చందనా జీ మహారాజ్ (వీరయతన్) గారు హాజరై తమ శుభాభినందనలు అందచేశారు.
📍Pune
Inaugurated 'Abhay Prabhavana – Museum and Knowledge Center,' a remarkable initiative by Amar Prerana Trust, in Pune today.
This center symbolizes the strength of education and cultural preservation, aiming to inspire future generations by connecting them with our… pic.twitter.com/iIM3okucYZ
— Nitin Gadkari (@nitin_gadkari) November 5, 2024
అంతేకాకుండా ప్రముఖ బౌద్ధ మత గురువు శ్రీ దలైలామా గారి తరపున, సిలింగ్ టోంగ్‌ఖోర్ రింపోచె హాజరై కార్యక్రమానికి తమ ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను అందచేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఇంద్రాయణి నది ఒడ్డున ఈ అద్భుతమైన మ్యాజియాన్ని నిర్మించారు. 3.5 లక్షల చదరపు అడుగుల విశాలమైన నిర్మాణాన్ని సందర్శకుల కోసం మొత్తం ఎయిర్ కండీషన్డ్ గా సిద్ధం చేశారు. జైన మతం యొక్క బోధనలు చెప్పినట్లుగా… ఎంతో ఘన చరిత్ర ఉన్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతీ ఒక్కరికీ చాటి చెప్పాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు.
అద్భుతంగా రూపొందించబడిన 30 గ్యాలరీల్లో, 350కి పైగా ప్రత్యేకమైన కళాఖండాలు జైన విలువల యొక్క గొప్పదనం, విలువలు, సామాజిక శ్రేయస్సు, వ్యక్తిగత స్థాయిలో కరుణ లాంటి అద్భుతమైన లక్షణాల యొక్క సారాంశాన్ని ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తాయి. 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో (20 హెక్టార్లు) ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో.. హై–టెక్ ఆడియో–విజువల్స్, యానిమేషన్లు, వర్చువల్ రియాలిటీ, ఇంటరాక్టివ్ సిస్టమ్‌లు ఉన్నాయి.

Inaugural Speech By Jyotiraditya Scindia
అంతేకాకుండా సంక్లిష్టమైన తాత్విక మరియు ఆధ్యాత్మిక భావనలను వివరించడానికి ప్రత్యేకంగా రూపొందించిన 350+ కళాకృతులు, శిల్పాలు మరియు గొప్ప ప్రతిరూపాలతో సిద్ధంగా ఉంది ఈ మ్యూజియం. వీటితోపాటు మ్యూజియంలో 35 ప్రొజెక్టర్లు ఉన్నాయి. ఇవి కాకుండా 675 ఆడియో స్పీకర్లు, 230 ఎల్ఈడీ టీవీలు/కియోస్క్ లు, 8000 లైటింగ్ ఫిక్చర్‌లు, 650 టన్నుల హెచ్ వీఏసీ లోడ్, 5+ కిమీల హెచ్ వీఏసీ డక్టింగ్ మరియు సుమారు 2 MVA విద్యుత్ డిమాండ్ లోడ్ సందర్శకుల కోసం అందుబాటులో ఉన్నాయి. మ్యూజియం యొక్క ప్రశాంత వాతావరణం మరియు వినూత్న సాంకేతికత అద్భుతమైన అనుభూతిని మరియు భారతదేశం యొక్క వారసత్వ గొప్పదనాన్ని చాటిచెప్తాయి.
మ్యూజియాన్ని స్థాపించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం గురించి గౌరవనీయులు శ్రీ అభయ్ ఫిరోదియా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… “అభయ్ ప్రభవన ఎన్నో శతాబ్దాల నుంచి భారతదేశ నైతిక మరియు సాంస్కృతిక ప్రధానమైన శ్రమన్ మరియు జైన సంప్రదాయాల యొక్క లోతైన విలువలకు నివాళిగా నిలుస్తుంది. ఈ మ్యూజియం ఎడ్యుకేషన్, ఎంటర్ ప్రైజ్ మరియు ఎథిక్స్ (విద్య, సంస్థ మరియు విలువలు) లాంటి గొప్పవైన నీతి సూత్రాలను ప్రతిబింబిస్తుంది. కేవలం ఒక భావనలా కాకుండా, వ్యక్తులను సమానంగా చూడడం, అందరికి సమాన అవకాశాలు అందిస్తూ జీవితాన్ని సమాజం వైపు నడిపించడమే జైనమతం యొక్క ప్రదాన ఉద్దేశం. జైనమతం ద్వారా చెప్పబడిన భారతీయ నాగరికత యొక్క సిద్ధాంతాలను అన్వేషించడానికి మరియు వాటితో అనుసంధానించడానికి ఈ మ్యూజియం ప్రజలకు ఒక అద్బుతమైన వనరుగా ఉపయోగపడుతుందని మా ఆశ అని అన్నారు ఆయన.
- అసి : పనిముట్లు మరియు ఆయుధాలు
- మసి : ఇంకు మరియు సమాచార వ్యవస్థ
- కసి : వ్యవసాయం మరియు పశు పోషణ
- వాణిజ్య : వర్తకం మరియు వాణిజ్యం
- శిల్ప : వృత్తి నైపుణ్యాలు
- విద్య : మేధస్సు (గణితం, విశ్వోదృవ శాస్త్రం మరియు వైద్యవిద్య)
- అహింస : ఆలోచన, మాట మరియు చర్యల ద్వారా హింస మరియు గొడవలకు దూరంగా ఉండుట
- అపరిగ్రహ్ : ప్రతీది నాదేనన్న భావనకు దూరంగా ఉండడం
- అనేకంత్వద్ : సత్యం యొక్క గొప్పదనం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం
- క్షమ : దయగా ఉండడం మరియు కోరుకోవడం
“పన్న సమీఖయే దమ్మం” అనే జైన సూత్రం.. విచారణ మరియు వ్యక్తిగత విశ్వాసం ద్వారా సత్యాన్ని అన్వేషించమని చాటి చెప్తుంది.
పుణేలోని చారిత్రాత్మక ప్రాంతంలో, 2200 ఏళ్ల పురాతన పాలే జైన గుహల సమీపంలో, అభయ్ ప్రభవన మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచ సాంస్కృతిక మైలురాయిగా మారేందుకు సిద్ధంగా ఉంది. ప్రతిరోజూ 2,000 మంది సందర్శకులను వస్తారని అంచనా వేస్తున్నారు. అద్భుతమైన మరియు భారతీయ విలువలను చిహ్నంగా కలిగిన ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా… జైనమతం అందించే కాలాతీత జ్ఞానం మరియు విలువలను ప్రతీ ఒక్కరికీ చాటిచెప్పేందుకు ఇప్పుడు అవకాశం ఏర్పడుతుంది. ఈ మ్యూజియం పుణేను సాంస్కృతిక అన్వేషణకు కేంద్రంగా మారుస్తుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక మరియు నైతిక అభ్యాసంలో ప్రపంచ భూభాగంలో ఈ నగరం యొక్క స్థానాన్ని బలోపేతం చేస్తుంది.
ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన అమర్ ప్రేరణ ట్రస్ట్.. గౌరవనీయులైన అభయ్ ఫిరోడియా నాయకత్వంలో, భారతదేశ వారసత్వాన్ని రక్షించడానికి మరియు విద్య మరియు ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది. అభయ్ ప్రభవన మ్యూజియం ద్వారా, భారతదేశ నైతిక సంప్రదాయాలను గౌరవాన్ని అందించడమే కాకుండా భవిష్యత్ తరాలకు వారి జీవితంలో విలువలను స్వీకరించేందుకు ట్రస్ట్ కృషి చేస్తుంది.