Kerala: ఓ మహిళ ప్రాణాలు కాపాడిన పసిపాప అరుపు!
కేరళలోని అన్నై కట్టి ప్రాంతంలో అడవి జంతువులకు తాగునీరు కరువవడంతో జనావాసాల్లోకి చొరబడి దాడులు చేస్తున్నాయి. ఈ ఘటనలను కట్టడిచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పెద్దగా చర్యలు తీసుకోకపోవడంతో వన్య మృగాల
- By Nakshatra Published Date - 09:20 PM, Thu - 9 March 23

Kerala: కేరళలోని అన్నై కట్టి ప్రాంతంలో అడవి జంతువులకు తాగునీరు కరువవడంతో జనావాసాల్లోకి చొరబడి దాడులు చేస్తున్నాయి. ఈ ఘటనలను కట్టడిచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పెద్దగా చర్యలు తీసుకోకపోవడంతో వన్య మృగాల దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అన్నై కట్టిలో హృదయాన్ని కదిలిం చే ఘటన వెలుగుచూసింది.
అడవి నుంచి జనారణ్యంలోకి వచ్చిన భారీ ఏనుగు మంగళవారం ఉదయం 4 గంటలకు ఓ ఇంటి దక్కరకు వచ్చింది. అయితే అక్కడే ఉన్న వారిపైపు ఒక్క సారిగా ఏనుగు తిరిగింది. మహిళను కింద పడేసింది. బాలామణికి కొద్దిదూరంలోనే ఆ పసిపాప కూడా ఉంది. అది గనుక దాడిచేస్తే క్షణాల్లోఆమె ప్రాణాలు గాల్లోకలిసేవే. అయితే,
అదృష్టవశాత్తూ బాలామణి ప్రమాదం నుంచి బయటపడింది.
భయానక ఘటనతో వణికిపోయిన ఆ పసిపాప బిగ్గరగా ఏడ్చింది. అది చూసిన ఆ ఏనుగు బాలామణికి హాని తలపెట్టకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ప్రభుత్వం వాటికి నీటిని సరఫరా చేయాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు.

Related News

Sabarimala: దారుణం.. లోయలో పడిన బస్సు.. గాయపడిన 62 మంది అయ్యప్ప స్వామి భక్తులు?
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన కూడా వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వాహన ప్రమాదాల