Watch Video: పోకిరీని చితకబాదిన బెజవాడ అమ్మాయి!
కాలేజీ అమ్మాయిలు, బాలికలు, యువతలను ఆకతాయిలు టీజింగ్ చేయడం సర్వసాధారణంగా మారింది.
- Author : Balu J
Date : 29-04-2022 - 3:24 IST
Published By : Hashtagu Telugu Desk
కాలేజీ అమ్మాయిలు, బాలికలు, యువతలను ఆకతాయిలు టీజింగ్ చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే కొందరు అమ్మాయిలు మౌనంగా వేదనను అనుభవిస్తుంటే.. మరికొందరు పోకిరీల ఆగడాలను తిప్పికొడుతున్నారు. బహిరంగంగానే దేహశుద్ది చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని గన్నవరం కు చెందిన ఓ అమ్మాయి పోకిరీ ఆట కట్టించి శభాష్ అనిపించుకుంటోంది. ఎయిర్ పోర్ట్ లో పని ముగించుకొని రాత్రి సమయంలో ఇంటికి వెళ్తుండగా, ఓ ఆకతాయి బైక్‌పై ఫాలో చేస్తూ ఇబ్బందికి గురిచేశాడు. దీంతో యువతి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి.. దేహశుద్ధి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతి ప్రయత్నాన్ని నెటిజన్స్ మెచ్చుకుంటూ శభాష్ సిస్టర్ అని అంటున్నారు.
గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా బైక్ ను అడ్డగించి వేధించిన దుండగుడిని కర్రతో చితక్కొట్టిన ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్.. pic.twitter.com/1HGGQ0YMWy
— Vasireddy Padma (@padma_vasireddy) April 29, 2022