Hyderabad University: క్యాంపస్ ప్లేస్మెంట్లలో హైదరాబాద్ వర్సిటీ సరికొత్త రికార్డు
క్యాంపస్ ప్లేస్మెంట్లలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సరికొత్త చరిత్ర సృష్టించింది.
- By Hashtag U Published Date - 06:41 PM, Sat - 23 April 22

క్యాంపస్ ప్లేస్మెంట్లలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సరికొత్త చరిత్ర సృష్టించింది. గత విద్యా సంవత్సరంలో 396 మంది విద్యార్థులకే క్యాంపస్ ప్లేస్మెంట్లు లభించగా, ఈసారి ఆ సంఖ్య ఏకంగా 485కు పెరిగింది. గతంలో ఎన్నడూ ఇంత భారీ సంఖ్యలో ఇక్కడి విద్యార్థులకు జాబ్ ఆఫర్లు రాలేదు. కొందరు స్టూడెంట్స్ కు గరిష్టంగా రూ.23 లక్షల వార్షిక వేతన ప్యాకేజీని పలు కంపెనీలు ఆఫర్ చేయడం విశేషం. గత ఏడాది ఇక్కడి విద్యార్థులకు లభించిన వార్షిక వేతన ప్యాకేజీ రూ.17 లక్షలే. ఈసారి మొత్తం 185 కంపెనీలు జాబ్స్ ఇచ్చాయి.
ఈ జాబితాలో tcs, deloitte, oracle, byjus, accenture, novartis, general electric, flipkart, hsbc, icici bank వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి. ప్లేస్‌మెంట్ ప్రక్రియలో భాగంగా కంపెనీలు.. ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించడంతోపాటు ఇంటర్వ్యూలను జూమ్/గూగుల్ మీట్/టెలిఫోనిక్ ద్వారా జరిపాయి. కాగా, వర్సిటీ చరిత్రలో ఇదే అత్యుత్తమ ప్లేస్మెంట్ ఇయర్ అని ప్లేస్‌మెంట్ గైడెన్స్ అండ్ అడ్వైజరీ (పీగాబ్) బ్యూరో ఇంచార్జీ ప్రొఫెసర్ సల్మాన్ అబ్దుల్ మోయిజ్ వెల్లడించారు.