Cosmic Explosion: ఖగోళంలో భారీ విస్ఫోటనం.. సంచలన విషయాలు బయటపెట్టిన సైంటిస్టులు
భారీ విశ్వ విస్ఫోటనాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు చూని అతి పెద్ద విశ్వ విస్పోటనాన్ని గుర్తించారు. అతిపెద్ద ఈ కాస్మిక్ పేలుడు భూమికి 8 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగింది.
- By Nakshatra Published Date - 08:27 PM, Fri - 12 May 23
Cosmic Explosion: భారీ విశ్వ విస్ఫోటనాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు చూని అతి పెద్ద విశ్వ విస్పోటనాన్ని గుర్తించారు. అతిపెద్ద ఈ కాస్మిక్ పేలుడు భూమికి 8 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగింది. దాదాపు మూడు ఏళ్ల పాటు ఈ పేలుడు కొనసాగగా.. సూపర్ నోవా విస్పోటనం కన్నా ఇది 10 రెట్లు అధిక ప్రకాశంతంగా ఉన్నట్లు భగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.
అయితే ఏటీ2021lwx అనే ఈ భారీ విశ్వవిస్పోటనాన్ని 2020లో కాలిఫోర్నియాలోని జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిటీ తొలిసారిగా గుర్తించింది. మాటలకు అందలేనంతంగా ఈ విస్పోటనం ఉందని, సూర్యుడు కంటే రెండు ట్రిలియన్ రేట్లు ప్రకాంశంతంగా ఉండటంతో దీనిని గుర్తించేందుు ఏడాది పాటు పట్టిందని భగోళ శాస్త్రవేత్త ఫిలిప్ వైజ్ మాన్ తెలిపారు. ఈ భారీ పేలుడు గురించి తెలుసుకుని తామే షాక్ అయ్యామని, దీని నుంచి వెలబడిన ఫైర్ బాల్ సౌరవ్యవస్థ కంటే 100 రెట్లు పెద్దదిగా ఉందని చెప్పారు.
వేల రెటలు ఉన్న భారీ క్లౌడ్స్, బ్లాక్ హోల్స్ ను విలీనం అవుతున్నప్పుడు జరుుగుతున్నాయని భగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీ ద్వారా రాత్రిపూట ఆకాశాన్ని స్కాన్ చేస్తారు. కాంతితో పాటు సూపర్ నోవాలు, తోకచుక్కలు, ఆస్టరాయిడ్స్ వంటి వాటిని గుర్తిస్తారు. ఇప్పుడు గుర్తించిన ఈ భారీ విస్పోటనం 10 బిలియన్ ఏళ్లలో సూర్యుడు విడుదల చేసే శక్తి కన్నా 100 రెట్ల శక్తిని ఏటీ2021డబ్ల్యూఎక్స్ మూడు సంవత్సరాల్లో విడుదల చేసినట్లు తెలిపారు. బ్లాక్ హెల్ వల్ల ఒక నష్టత్రం నాశనం అయినప్పుడు ఉత్పిత్తి అయ్యే కాంతి కంటే మూడు రెట్లు ప్రకాశవంతంగా ఉంటుందని తేల్చారు.సౌంతాస్టన్ యూనివర్సిటీలోని ఖగోళ శాస్త్రవేత్త ఫిలిప్ వైజ్ మాన్ దీనిపై రీసెర్చ్ చేస్తోన్నారు. ఈ పరిశోధన ఆయన ఆధ్వర్యంలో జరుగుతోంది.