Guinness Record: 9 ఏళ్ల బాలుడి గిన్నిస్ రికార్డు.. 4 సెకన్లలోనే రూబిక్స్ క్యూబ్ పరిష్కారం
9 ఏళ్ల చైనీస్ బాలుడు యిహెంగ్ వాంగ్ కేవలం 4 సెకన్లలోపు రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అతడు స్పిన్నింగ్ 3x3x3 పజిల్..
- Author : Maheswara Rao Nadella
Date : 25-03-2023 - 9:15 IST
Published By : Hashtagu Telugu Desk
Guinness Record : 9 ఏళ్ల చైనీస్ బాలుడు యిహెంగ్ వాంగ్ కేవలం 4 సెకన్లలోపు రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అతడు స్పిన్నింగ్ 3x3x3 పజిల్ క్యూబ్‌ను 3.90 సెకన్లలో ముగించాడు. మార్చి 12న మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన యోంగ్ జున్ KL స్పీడ్ క్యూబింగ్ 2023 పోటీ సెమీ ఫైనల్ లో యిహెంగ్ ఈ కొత్త రికార్డును నెలకొల్పాడు. అతని వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Record) ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించడం చాలామందికి సవాలుగా ఉంటుంది. దాన్ని ఎలా పరిష్క రిస్తారో చూడటం కూడా భలే సరదాగా ఉంటుంది. దీన్ని పరిష్కరించడానికి కొందరికి చాలా టైం పట్టొచ్చు కానీ.. ఈ 9 ఏళ్ల చైనీస్ కుర్రాడికి ఇది కేక్‌వాక్ లా అనిపిస్తోంది. 4.86 సెకన్ల వ్యవధిలో రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించి గతంలో మాక్స్ పార్క్ (అమెరికా), టైమన్ కొలాసిస్కీ (పోలాండ్) గిన్నిస్ రికార్డును (Guinness Record) నెలకొల్పారు.
వీరందరు నెలకొల్పిన రికార్డును యిహెంగ్ వాంగ్ తాజాగా బద్దలు కొట్టాడు. రూబిక్స్ క్యూబ్ 5 పరిష్కారాలను వాంగ్ వరుసగా 4.35, 3.90, 4.41, 5.31, 6.16 సెకన్లలో పూర్తి చేశాడు.వాంగ్ యొక్క 5 రూబిక్స్ క్యూబ్ పరిష్కారాలలో రెండోది (3.90 సెకన్లు) ఐదో వేగవంతమైన సింగిల్ పరిష్కారం. ఈ వీడియోను పోస్ట్ చేసినప్పటి నుంచి 1200 లైక్స్ వచ్చాయి. పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. “ఇంత చిన్న వయస్సులో ఇంత త్వరగా రూబిక్స్ క్యూబ్ ను పరిష్కరించడం నిజంగా ప్రశంసనీయం” అని ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. “నేను చైనీస్‌ని.. కానీ UKలో పెరిగాను. నేను క్యూబర్‌ని. అయితే యిహెంగ్ అంతటి స్థాయి నాకు లేదు. అతను ఎలా అభివృద్ధి చెందుతున్నాడో చూడడానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Also Read: Sundarakanda: సుందరకాండ కీలక సన్నివేశం