Ongole: ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం.. 9 ట్రావెల్స్ బస్సులు దగ్థం..!
- Author : HashtagU Desk
Date : 01-03-2022 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒంగోలు బైపాస్‌లో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు దగ్థమయ్యాయి. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులుగా వీటిని గుర్తించారు. నగర శివారులో ఉన్న ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో పార్క్ చేసి ఉన్న ట్రావెల్స్ బస్సుల్లో మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశాయి.
ఇక ముందుగా నాలుగు బస్సుల్లో మంటలు చెలరేగగా, మొత్తం 9 బస్సులు దగ్థమయ్యాయి. అక్కడ పార్కింగ్‌లో మొత్తం 20 బస్సుల వరకు ఉన్నాయని చెబుతున్నారు. మంటల ధాటికి దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టు పక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మిగిలిన బస్సులను తరలించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుండగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.