Millionaires Migration: ఇండియాకు 6500 మంది శ్రీమంతుల గుడ్ బై.. ఎందుకు ?
Millionaires Migration : ఈ ఏడాది ఇండియా నుంచి 6500 మంది మిలియనీర్లు వలస వెళ్ళిపోతారట. వారిలో చాలామంది దుబాయ్, సింగపూర్ దేశాలకు వెళ్లి సెటిల్ కావాలని ప్లాన్ చేసుకుంటున్నారట.. ఇంతకీ వాళ్ళు ఎందుకు వెళ్లిపోతున్నారు ?
- By Pasha Published Date - 01:58 PM, Wed - 14 June 23

Millionaires Migration : ఈ ఏడాది ఇండియా నుంచి 6500 మంది మిలియనీర్లు వలస వెళ్ళిపోతారట.
వారిలో చాలామంది దుబాయ్, సింగపూర్ దేశాలకు వెళ్లి సెటిల్ కావాలని ప్లాన్ చేసుకుంటున్నారట..
ఇంతకీ వాళ్ళు ఎందుకు వెళ్లిపోతున్నారు ?
ఈవిషయంలో ఇతర దేశాల పరిస్థితి ఏమిటి ?
ఎక్కువ సంఖ్యలో మిలియనీర్లు వలస వెళ్లిపోనున్న దేశాల లిస్ట్ లో చైనా మొదటి స్థానంలో నిలిచింది. అక్కడి నుంచి ఈ ఏడాది అత్యధికంగా 13,500 మంది కోటీశ్వరులు మైగ్రేట్ అవుతారని హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ ఒక రిపోర్ట్ ను పబ్లిష్ చేసింది. అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (HNWI) అంటే 8 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగల వ్యక్తులు. వీరిని పరిగణలోకి తీసుకొని ఈ అధ్యయనం నిర్వహించామని వెల్లడించింది. మిలియనీర్లు వలస వెళ్లిపోతున్న(Millionaires Migration) దేశాల జాబితాలో ఇండియా రెండో స్థానంలో నిలిచింది.
Also read : Vastu Tips For Money: బీరువాలో ఈ ఒక్క వస్తువు ఉంటే చాలు.. మీరు కోటీశ్వరులు అవ్వడం కాయం?
గత సంవత్సరం మన దేశం నుంచి 7,500 మంది మిలియనీర్స్ విదేశాలకు వెళ్లిపోగా.. ఈ సంవత్సరం మరో 6500 మంది వెళ్ళిపోతారని నివేదిక అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి దాదాపు 1,28,000 మంది మిలియనీర్లు ఈ ఏడాది వలస వెళ్లే అవకాశం ఉందని హెన్లీ & పార్ట్‌నర్స్ CEO డాక్టర్ జుర్గ్ స్టెఫెన్ చెప్పారు. పన్ను చట్టాలు కఠినంగా ఉండటం.. వ్యాపార అనుమతుల మంజూరు ప్రక్రియలోని క్లిష్టతల కారణంగా భారతదేశం నుంచి మిలియనీర్లు వలస వెళ్తున్నారని నివేదిక తెలిపింది.
కోటీశ్వరులు ఎక్కడికి పోతున్నారంటే ?
ఈ ఏడాది అత్యధికంగా 5,200 మంది మిలియనీర్లు ఆస్ట్రేలియాకు వెళ్లే ఛాన్స్ ఉంది. 4,500 మంది మిలియనీర్లు UAEకి.. 3,200 మంది మిలియనీర్లు సింగపూర్‌కు.. 2,100 మంది మిలియనీర్లు అమెరికాకు వెళ్లనున్నారని నివేదిక అంచనా వేసింది. వీటి తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్, కెనడా, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చుగల్, న్యూజిలాండ్ ఉన్నాయి.