ఆస్పత్రికి 60ఏళ్ల అంధ ఏనుగు
60ఏళ్ల వయస్సు అంధ ఏనుగును కాపాడేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మధుర లోని ఎలిఫెంట్ కన్జర్వేషన్ అండ్ కేర్ సెంటర్ రక్షించి పునరావాసం కల్పించిన ఆ ఏనుగు ప్రస్తుతం అనేక వ్యాధులతో బాధపడుతుంది.
- By CS Rao Published Date - 04:45 PM, Thu - 23 December 21
60ఏళ్ల వయస్సు అంధ ఏనుగును కాపాడేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మధుర లోని ఎలిఫెంట్ కన్జర్వేషన్ అండ్ కేర్ సెంటర్ రక్షించి పునరావాసం కల్పించిన ఆ ఏనుగు ప్రస్తుతం అనేక వ్యాధులతో బాధపడుతుంది. దీంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.వృద్ధాప్యం కారణంగా అల్లం (‘అల్లం పేరుతో ఏనుగును పిలుస్తారు) అంధురాలు. అది ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతోంది. ఫుట్‌ప్యాడ్‌లు, పోషకాహార లోపం కారణంగా వచ్చే వ్యాధులతో బాధపడుతోంది. ఆ విషయాన్ని వైల్డ్‌లైఫ్ SOS డిప్యూటీ డైరెక్టర్, వెటర్నరీ సర్వీసెస్, డాక్టర్ S ఇళయరాజా వెల్లడించాడు. లేజర్ థెరపీతో సహా నొప్పి నివారణకు చర్యలను తీసుకున్నారు.
యూపీ రాష్ట్ర అటవీ శాఖ, సంరక్షణ స్వచ్ఛంద సంస్థ వన్యప్రాణి SOS సంయుక్త బృందం అల్లంను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. చికిత్స అందించడానికి కేంద్రం కట్టుబడి ఉందని వైల్డ్‌లైఫ్ SOS సహ వ్యవస్థాపకుడు మరియు CEO కార్తిక్ సత్యనారాయణ తెలిపాడు.