Home Remedies : పులిపిర్లు తగ్గాలంటే ఈ చిట్కాలు ట్రై చెయ్యండి.. ఈజీగా నివారించోచ్చు!
పులిపిర్లు లేదా పులిపిరి కాయలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా మెడ,చేతులు,ముఖం పాదాలపై
- By Nakshatra Published Date - 11:30 AM, Sun - 14 August 22
పులిపిర్లు లేదా పులిపిరి కాయలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా మెడ,చేతులు,ముఖం పాదాలపై ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఈ పులిపిర్లు కూడా రెండు రకాలు ఉన్నాయి. అందులో కొన్ని పులిపిర్లు చర్మం లో కలిసిపోతుంటాయి. ఇటువంటి పులిపిర్లు పెద్దగా నొప్పి రావు. కానీ కొన్ని దురద మంట పుడుతుంటాయి.చేతి వేళ్ల చుట్టూ వచ్చే పులిపిర్లను కామన్ వార్ట్స్ అని అంటారు. పాదాలపై వచ్చే పులిపిర్లను ప్లాంటార్ వార్ట్స్ అంటారు. ముఖం, మెడ మీద వచ్చే పులిపిర్లను ఫ్లాట్ వార్ట్స్ అని అంటారు. కొంతమందికి జననాంగాలపై కూడా ఇవి ఏర్పడతాయి. వాటిని జనైటల్ వార్ట్స్ అని పిలుస్తారు. మరి ఈ పులిపిర్లు తగ్గాలి అంటే ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
యాపిల్ సిడర్ వెనిగర్: ఈ యాపిల్ సిడర్ వెనిగర్ లో అధిక యాసిడ్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల పులిపిర్లు మరింత పెరగకుండా సహజ సిద్ధంగానే తగ్గిపోతాయి. దూదిని యాపిల్ సిడర్ వెనిగర్లో ముంచి పులిపుర్లు ఉన్నచోట అద్దాలి.
కలబంద: కలబంద లో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్ల పై రాయాలి.
బేకింగ్ పౌడర్: ఆముదంలో,బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపి దాన్ని పులిపిర్ల పై రాసి బ్యాండేజ్ వేసి,రాత్రంతా వదిలిపెట్టాలి. ఇలా రెండు నుంచి మూడు రోజులు చేసినట్లయితే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.
అరటి పండు తొక్క: అరటి పండు తొక్కలో ఉండే ఎంజైమ్లు చర్మానికి మేలు చేస్తాయి. అరటి పండు తొక్కతో ప్రతి రోజు పులిపిర్లపై రుద్దితే క్రమేనా పులిపిర్లు తగ్గుతాయి.
వెల్లులి: చర్మ వ్యాధుల నివారణకు ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఎల్లిసిన్ ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడి పులిపిర్లను తొలగించడంలో కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది.
Related News
Warts: 2 రూపాయలతో ఐదు సెకండ్లలో ఎలాంటి పులిపిర్లు అయినా మాయం అవ్వాల్సిందే?
మామూలుగా చాలామందికి మెడ ముఖ భాగం శరీరంలో ఇంకా కొన్ని భాగాలలో పులిపిర్లు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఒకటి రెండు లేదా కొన్ని వస్తే ఉంటే మరి కొంతమందికి ముఖం నిండా మెడ భాగం మొత్తం వచ్చి అంద విహీనంగా కనిపిస్తూ ఉంటారు. ఈ పులిపిర్లను తగ్గించుకోవడానికి చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ పులిపిర్లు కూడా అలాగే వచ్చి మన అందాన్ని చెడగొడుతూ ఉంటాయి. అయితే పులిపిర్లను సరైన