Delhi: దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై ప్యూన్ దారుణంగా అలా?
దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక ప్రదేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు ఇంట బయట ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతోంది. దీంతో మహిళలు
- By Anshu Published Date - 07:25 PM, Thu - 11 May 23

దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక ప్రదేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు ఇంట బయట ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతోంది. దీంతో మహిళలు పక్కవారిని నమ్మాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితిలో నెలకొంటున్నాయి. అయితే ఆడపిల్లల రక్షణ కోసం ఎన్నో రకాల చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కామాంధులు ఆగడానికి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. కామందుల పట్ల ప్రభుత్వాలు సరైన కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో కామాంధులు మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు.
పసిపిల్లల నుంచి పండు వృద్ధుల వరకు ఏ ఒక్కరిని విడిచి పెట్టడం లేదు కామాంధులు. చిన్న పెద్ద, అక్క చెల్లి అని వావి వరసలు మరిచి కూడా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో నాలుగేళ్ళ విద్యార్థి పై స్కూల్ ప్యూన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రోహిణిలోని ఒక పాఠశాలలో ప్యూన్ గా పనిచేస్తున్న 43 ఏళ్ల వ్యక్తి నాలుగేళ్ల బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు.
అయితే తమ కుమార్తె పై వేధింపులకు పాల్పడినట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. చిన్నారి చెప్పిన ఆధారాలతో పోలీసులు స్కూల్లో ప్యూన్ గా పనిచేస్తున్న సుల్తాన్ పురికి చెందిన సునీల్ కుమార్ అని 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 బీ ఫోక్సే చట్టం సెక్షన్ 10 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.