Blast At Cracker Factory: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు (Blast At Cracker Factory) ఘటనలో.. ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే (3 Killed) మరణించారు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో ఆదివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా
- Author : Gopichand
Date : 01-01-2023 - 8:08 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు (Blast At Cracker Factory) ఘటనలో.. ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే (3 Killed) మరణించారు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో ఆదివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బార్షి తాలూకాలోని షిరాలా వద్ద ఉన్న యూనిట్‌లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయని ఒక అధికారి తెలిపారు.
Also Read: Kabul: కాబూల్ ఆర్మీ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ పేలుడు.. ఏకంగా 10 మంది పౌరులు స్పాట్ డెడ్?
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 40 మంది వరకు ఉన్నారని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.బార్షి రాష్ట్ర రాజధాని ముంబైకి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది.