Hyderabad:న్యూ ఇయర్ సందర్భంగా 2,500 డ్రంక్ డ్రైవ్ కేసులు
న్యూ ఈయర్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వేలాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
- By Siddartha Kallepelly Published Date - 10:58 AM, Sun - 2 January 22

న్యూ ఈయర్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వేలాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
డిసెంబర్ 31 ఒక్కరోజే 3,146 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,528 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,258 కేసులు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.
మోతాదుకు మించి మద్యం తాగివాహనాలు నడిపే వాళ్ల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించారు. మోతాదుకు మించి మద్యం తాగినట్లు గుర్తించిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.
మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు 265 బృందాలుగా ఏర్డి పలుచోట్ల తనిఖీలు నిర్వహించి, ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం న్యూఈయర్ వేడుకల్లో ప్రమాదాలు తగ్గాయని అధికారులు తెలిపారు.