Electrocution: హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గంలో హృదయ విదారక ఘటన
హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గంలో సోమవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ధన్‌బాద్ మరియు గోమోహ్ మధ్య నిచిత్‌పూర్ సమీపంలో 25,000 వోల్ట్ కరెంటు వైర్ తగలడంతో ఆరుగురు సజీవదహనమయ్యారు.
- By Praveen Aluthuru Published Date - 03:07 PM, Mon - 29 May 23

Electrocution: హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గంలో సోమవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ధన్‌బాద్ మరియు గోమోహ్ మధ్య నిచిత్‌పూర్ సమీపంలో 25,000 వోల్ట్ కరెంటు వైర్ తగలడంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. విద్యుత్ తీగకు తగిలి చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. హైటెన్షన్ వైర్ కావడంతో శరీరం చాలా వరకు కాలిపోయింది. ఈ ఘటనతో ఈ రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
ఘటనకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ధన్‌బాద్ రైల్వే డివిజన్‌లోని ప్రధాన్‌ఖాంట నుంచి బంధువా వరకు దాదాపు 200 కి.మీ రైలు మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 120 నుండి 160 కి.మీలకు పెంచే పనులు జరుగుతున్నాయి. సోమవారం రైల్వే టీఆర్‌డీ విభాగం తరఫున నిచిత్‌పూర్ హాల్ట్ రైలు గేటు సమీపంలో స్తంభం ఏర్పాటు పనులు చేపట్టారు. ఇలాంటి పనులు మొదలు పెట్టాలంటే కాంట్రాక్టర్ ఆ చుట్టు ప్రక్కల నిషేధ బోర్డు అమర్చాలి. అలాగే క్రేన్ సహాయంతో పనులు చేయించాలి. కానీ కాంట్రాక్టర్ అనుమతి లేకుండానే కాంట్రాక్టు కార్మికులతో పనులు చేయించుకుంటున్నాడు. కూలీలు స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా స్తంభం 25 వేల వోల్టుల హైటెన్షన్ ఓవర్ హెడ్ వైర్ వైపు వాలింది. అదుపు చేసే క్రమంలో స్తంభం హైటెన్షన్ వైరుకు తగలడంతో కరెంట్ షాక్ తో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన అనంతరం తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కాంట్రాక్టర్ పరారయ్యాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న డీఆర్‌ఎం కమల్ కిషోర్ సిన్హా ఆరుగురి మృతిని ధృవీకరించారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Read More: IT Job To Goli Soda : పెద్ద జాబ్ వదిలేసి.. గోలీ సోడా బిజినెస్ పెట్టాడు