Shoes Theft: విచిత్ర దొంగలు.. తుపాకి గురిపెట్టారు, బూట్లు దొంగిలించారు!
ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే బంగారమో, డబ్బులో చోరీకి గురికావడం కామన్.
- Author : Balu J
Date : 05-07-2023 - 5:31 IST
Published By : Hashtagu Telugu Desk
ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే బంగారమో, డబ్బులో చోరీకి గురికావడం కామన్. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఓ ఇద్దరు దొంగలు మాత్రం షూ(బూట్లు) దొంగిలించి పోలీసులకు దొరికిపోయారు. హర్యానాలోని రేవారీలో తుపాకీతో షాపు యజమాని నుంచి నాలుగు జతల బూట్లు దోచుకున్నారు. దీంతో ఇద్దరికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది. దోపిడీకి పాల్పడిన నిందితుడికి కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.41 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో ఇరువురు అదనంగా ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
2021లో, షాప్ యజమాని అశోక్ కుమార్ రేవారిలో ఉన్న తన దుకాణంలో ఉండగా, నిందితులు కాళీ మరియు దీపక్ మోటారుసైకిల్‌పై వచ్చి తుపాకీతో బెదిరించి బూట్లు దొచుకెళ్లారు. షాపు యజమానిని బెదిరించి పిస్టల్స్ చూపి రూ.8 వేల విలువైన నాలుగు జతల షూలను ప్యాక్ చేసి పారిపోయారు. నేరం జరిగిన కొన్ని గంటల్లోనే వారిని అరెస్టు చేశారు.
Also Read: Prajakavi Kaloji: కాళోజీ నారాయణ రావు జీవితాన్ని ఆవిష్కరించే ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!