Hanamkonda: వరంగల్‌లో 19 ఏళ్ళ యువతిపై అత్యాచారం..
తెలంగాణాలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్ లో 19ఏళ్ళ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థి అవ్నేష్. వివరాలలోకి వెళితే..
- Author : Praveen Aluthuru
Date : 05-07-2023 - 5:51 IST
Published By : Hashtagu Telugu Desk
Hanamkonda: తెలంగాణాలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్ లో 19ఏళ్ళ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థి అన్వేష్. వివరాలలోకి వెళితే..
వరంగల్ లోని రామప్ప ఆలయానికి వెళ్లి హన్మకొండకు తిరిగి వస్తున్నారు అన్వేష్, అఖిల్ మరియు మరో స్నేహితుడు. అన్వేష్ కోమట్‌పల్లి టోల్ ప్లాజా దగ్గర ఆగగా.. సమీపంలోని దుకాణం నుండి వాటర్ బాటిల్ కొనడానికి అఖిల్‌ని పంపాడు. అయితే అదే ప్రదేశంలో 19 ఏళ్ళ యువతీ ఉపశమనం కోసం వేచి ఉంది. ఇది గమనించిన అన్వేష్ ఆ యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ యువతిపై అన్వేష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఏసీపీ కిరణ్ కుమార్ కథనం ప్రకారం.. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు హన్మకొండకు చెందిన కె అన్వేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. రామప్ప ఆలయానికి వెళ్లి హన్మకొండకు తిరిగి వస్తుండగా సంఘటన జరిగింది అని పోలీసు అధికారి తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
Read More: Flight Passenger: విమానం టేకాఫ్ అవుతుండగా తలుపు తెరిచే ప్రయత్నం చేసిన ప్రయాణికుడు.. చివరికి?