18 People Lose Eyesight : వికటించిన కంటి ఆపరేషన్.. అంధులైన 18 మంది
18 People Lose Eyesight : వాళ్ళు తమ కంటిచూపు ఇంకా బెటర్ కావడానికి సర్జరీ చేయించుకున్నారు..
- By Pasha Published Date - 04:04 PM, Wed - 12 July 23

18 People Lose Eyesight : వాళ్ళు తమ కంటిచూపు ఇంకా బెటర్ కావడానికి సర్జరీ చేయించుకున్నారు.. అయితే ఉన్న చూపు కూడా పోయి.. గుడ్డివాళ్ళుగా మారారు.. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరొందిన సవాయ్ మాన్ సింగ్ (SMS) ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఈ ఆసుపత్రిలో కంటిశుక్లం ఆపరేషన్లు చేయించుకున్న వారిలో 18 మంది చూపును కోల్పోయారని వినవస్తోంది. వీరికి రాజస్థాన్ ప్రభుత్వం అమలుచేసే చిరంజీవి ఆరోగ్య పథకం కింద ఈ ఆపరేషన్లు చేశారని తెలుస్తోంది. కంటి ఆపరేషన్లు జరిగిన వారం తర్వాత వీరు ఒక్కరొక్కరుగా మళ్ళీ ఆస్పత్రికి వచ్చారు. తీవ్రమైన కంటి నొప్పి ఉందని డాక్టర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని మళ్ళీ ఆసుపత్రిలో చేర్చుకొని ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. కొందరికి మళ్లీ సర్జరీ చేసినా పోయిన కంటిచూపు(18 People Lose Eyesight) తిరిగి రాలేదు.
Also read : Wife-Husband 7 Arrests : భర్తను ఆడుకున్న భార్య..7 సార్లు జైలు..7 సార్లు బెయిలు!!
18 మంది కంటిచూపు పోయినా.. ఆసుపత్రిలోని ఆప్తమాలజీ విభాగం అధికారులు తమ వైపు నుంచి ఎటువంటి లోపం లేదని స్పష్టం చేశారు. రోగుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. “జూన్ 23న నా కళ్ళకు ఆపరేషన్ చేశారు. జూలై 5 వరకు కంటిచూపు ఉంది.. కానీ జూలై 6 నుంచి కళ్ళు కనిపించడం లేదు. ఆ తర్వాత మరోసారి ఆస్పత్రి వాళ్ళు కంటికి ఆపరేషన్ చేసినా చూపు తిరిగి రాలేదు. నేను కంటి చూపు కోల్పోవడానికి కారణం ఇన్ఫెక్షన్ అని డాక్టర్లు చెప్పారు. ఇన్ఫెక్షన్ ను నయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వాళ్ళు అన్నారు” అని బాధిత రోగి ఒకరు చెప్పారు.