Syria: మిలిటరీ బస్సులో పేలుడు.. 17 మంది సైనికులు మృతి?
తాజాగా సిరియాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
- By Anshu Published Date - 04:01 PM, Thu - 13 October 22

తాజాగా సిరియాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. సిరియాలో ఒక మిలటరీ బస్సులో పేలుడు సంభవించింది. ఇక ఆ ఘటనలో ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిరియా రాజధాని అయిన డమాస్కస్ ప్రాంతంలో తాజాగా మిలటరీ బస్సులో పేలుడు జరిగింది. ఈ పీరుడు కారణంగా ఆ బస్సులోని పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక షామ్ ఎఫ్ఎం తెలిపింది.
కాగా పేరుడు కారణంగా బస్సులో ఉన్న 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. అయితే ఆ పేలుడు గల కారణాలు ఏమిటి అన్నది ఇప్పటివరకు తెలియలేదు. అలాగే ఇప్పటివరకు ఏ సంస్థ కూడా పేలుడుకు బాధ్యత వహించలేదు. అంతేకాకుండా సిరియాలో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ ఘర్షణ కారణంగా ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.
తిరుగుబాటుదారుల నుంచి సిరియా ప్రభుత్వ దళాలు తిరిగి భూభాగాన్ని స్వాధీనం చేసుకోగలగా.. ప్రభుత్వం నియంత్రణలో ఉన్న డమాస్కస్ ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇకపోతే ఆ బస్సులో పేడుకు గల కారణం ఏంటి అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.