HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >15 Kidney Transplant Surgeries In A Month

Nims: ఒకే నెలలో 15 కిడ్నీ మార్పిడి స‌ర్జ‌రీలు: హరీశ్ రావు

  • Author : Balu J Date : 07-03-2023 - 1:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harishrao review corona
Harishrao

హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుప‌త్రి జాతీయ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో 15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించింది. దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్రభుత్వ ఆసుప‌త్రిగా జాతీయ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు నిమ్స్‌ యూరాలజీ విభాగాన్ని అభినందించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేర‌కు అవయవ మార్పిడి సర్జరీలను ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

నిమ్స్‌ యూరాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ నేతృత్వంలో డాక్టర్‌ సీహెచ్‌ రామ్‌ రెడ్డి, డాక్టర్‌ ఎస్‌ విద్యాసాగర్‌, డాక్టర్‌ జీ రామచంద్రయ్య, డాక్టర్‌ జీవీ చరణ్‌ కుమార్‌, డాక్టర్‌ ఎస్‌ఎస్‌ఎస్‌ ధీరజ్‌తో కూడిన బృందం ఈ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. డాక్టర్‌ పద్మజ, డాక్టర్ జే నిర్మల నేతృత్వంలోని అనస్థీషియా విభాగం, డాక్టర్‌ టీ గంగాధర్‌, డాక్టర్ భూషణ్ రాజ్ నేతృత్వంలోని నెఫ్రాలజీ విభాగం వారికి స‌హ‌క‌రించారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ నిమ్స్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. భారీగా నిధులు కేటాయించారు. దీంతో ఆసుప‌త్రిలో అత్యాధునిక వసతులు సమకూరాయి. నిమ్స్ ఆసుప‌త్రి మల్టీ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌గా మారింది. ఇక్కడ కిడ్నీతోపాటు కాలేయం(లివర్‌), గుండె (హార్ట్‌), ఊపిరితిత్తులు (లంగ్‌) మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. అవయవ మార్పిడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు కేటాయిస్తూ, పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నది. అంతేకాకుండా రోగుల‌కు జీవితాంతం అవసరమయ్యే మందులను ఉచితంగా అంజేస్తున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో విజవంతంగా సర్జరీలు చేస్తున్నట్లు డాక్టర్ రాహుల్ దేవరాజ్, యురాలజి విభాగం హెచ్ వో డి తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harish rao
  • hyderabad
  • kidney
  • nims

Related News

Srh Klassen

IPL 2026 : SRH ఫ్యాన్స్ కు క్లాసెన్ దేవుడయ్యాడు !!

క్లాసెన్ ప్రదర్శనపై ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రేమను కురిపిస్తున్నారు. "క్లాసెన్ ఫ్యాన్స్ కు దేవుడయ్యాడు" అంటూ పోస్ట్‌లు పెడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆటగాడు

  • Brs25years

    BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

  • Preethi Reddy

    Preethi Reddy : BJP లో చేరడంపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ !!

  • Rtc Workers Protest

    RTC Strike : ప్రభుత్వం తో చర్చలకు సిద్ధం – JAC

Latest News

  • AP 10th Results : ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల..అమ్మాయిలదే పైచేయి !!

  • KTR : కేటీఆర్ చెంప చెల్లుమనిపించాడు

  • Exit Polls 2026 – విజయ్ పార్టీకి ఎక్కువ ఓట్లు వేసింది వారేనా ?

  • Ashu Reddy : హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

  • Spirit : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపిన ‘స్పిరిట్’ టీం

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd