Constable Posts: ఒకే గ్రామం నుంచి 13 మందికి పోలీస్ జాబ్
మధ్యతరగతి విద్యార్థులు పోలీస్ నియామకాల్లో సత్తా చాటుతున్నారు. కానిస్టేబుల్, ఎస్సై, ఆ పై స్థాయి పోలీస్ అధికారులు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్లే.
- By Praveen Aluthuru Published Date - 03:18 PM, Thu - 5 October 23

Constable Posts: మధ్యతరగతి విద్యార్థులు పోలీస్ నియామకాల్లో సత్తా చాటుతున్నారు. కానిస్టేబుల్, ఎస్సై, ఆ పై స్థాయి పోలీస్ అధికారులు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్లే. పోలీస్ ఉద్యోగాలు మహా అయితే ఉరికి ఒక ఉద్యోగం లేదా మండలానికి పదిమంది అర్హత సాధిస్తారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఊర్లో ఏకంగా 13 మంది కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. పోలీసు నియామక ఫలితాల్లో తల్లాడ మండలం మల్లవరం నుంచి 13మంది కానిస్టేబుళ్లు ఎంపికయ్యారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా ఉపేందర్, హరీష్, సివిల్లో సైదులు, శ్రీకాంత్, ఎఆర్లో తిరుపతిరావు, కటికి ప్రవళిక, టిఎస్ఎస్పీలో రవీందర్,పవన్, దుగ్గిదేవర వంశీ, యర్రి లక్ష్మణరావు, శ్రీహరి, వరుణ్, ఎస్పీఎఫ్ లో రాంమోహన్ లు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. అలాగే చింతకాని మండలంలో ఏడుగురు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి గవర్నమెంట్ జాబ్ సాధించడం పట్ల గ్రామస్థులు అభినందిస్తున్నారు. మునుముందు ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.
Also Read: Chiranjeevi – Satyanand : సత్యానంద్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం ఫై చిరు ‘ప్రశంసలు ‘