Madagascar Stampede : స్టేడియంలో తొక్కిసలాట 13 మంది మృతి.. 83 మందికి గాయాలు.. 11 మంది పరిస్థితి విషమం
Madagascar Stampede : 11వ ‘ఇండియన్ ఓసియన్ క్రీడల’ పోటీలలో విషాదం చోటుచేసుకుంది. మడగాస్కర్ రాజధాని అంటననారివోలోని స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ క్రీడల పోటీల సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
- By Pasha Published Date - 10:29 AM, Sat - 26 August 23

Madagascar Stampede : 11వ ‘ఇండియన్ ఓసియన్ క్రీడల’ పోటీలలో విషాదం చోటుచేసుకుంది. మడగాస్కర్ రాజధాని అంటననారివోలోని స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ క్రీడల పోటీల సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13 మంది చనిపోయారు. దాదాపు 83 మంది గాయపడ్డారు. ఈవిషయాన్ని మడగాస్కర్ ప్రధానమంత్రి క్రిస్టియన్ ఎన్ట్సే వెల్లడించారు. క్రీడల పోటీలను చూసేందుకు దాదాపు 50,000 మంది వచ్చారు. అయితే వందలాది మంది స్టేడియంలోకి వచ్చేందుకు ఎంట్రెన్స్ గేటు దగ్గర ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలోనే 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also read : Special Trains Extended : ఈ రూట్లలో స్పెషల్ రైళ్లు ఇంకొన్నాళ్లు పొడిగింపు
గాయాల పాలైన 83 మందిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈవివరాలను మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా (Madagascar Stampede) కూడా ధ్రువీకరించారు. క్రీడా పోటీల్లో ప్రాణ నష్టం జరగడంపై విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. నైరుతి హిందూ మహా సముద్ర దేశాలు మాత్రమే పాల్గొనే ఈ పోటీలను నాలుగేళ్లకోసారి నిర్వహిస్తుంటారు. సెప్టెంబర్ 3 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. గతసారి ఈ పోటీలు మారిషస్‌లో నిర్వహించారు.