Uttar Pradesh: పది రూపాయల కోసం దుకాణదారుడు ని కాల్చిన దుండగులు?
ప్రస్తుత రోజుల్లో మనుషులకు సహనం అన్నది లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకే కోపగించుకోవడం, కొట్టుకోవడం తిట్టుకోవడం లాంటివి చేయడంతో పాటు ఎద
- By Anshu Published Date - 05:11 PM, Fri - 30 June 23

ప్రస్తుత రోజుల్లో మనుషులకు సహనం అన్నది లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకే కోపగించుకోవడం, కొట్టుకోవడం తిట్టుకోవడం లాంటివి చేయడంతో పాటు ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీయడం వరకు వెళ్తున్నారు. చిన్న చిన్న విషయాలకే చాలామంది ఎదుటి వ్యక్తి ప్రాణాలను తీయడానికి కూడా వెనకట్టడం లేదు. మొన్నటికి మొన్న కర్ణాటకలో టోల్గేట్ సిబ్బందిలో ఒకరు ఇతరులకు తెలియకుండా వంద రూపాయలు తీశాడు అన్న నెపంతో అతన్ని కొట్టి చంపేశారు.
తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కేవలం పది రూపాయల కోసం దుకాణదారునిపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురిలో కేవలం పది రూపాయల కోసం చెలరేగిన వివాదం కాస్త ఒక దుకాణదారుని ప్రాణాలు తీసింది. ఈ ఘటన జూన్ 12న జరగగా దాదాపు పదిహేను రోజుల తర్వాత నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జాతవ్ తన దుకాణంలో పెట్రోల్ తో పాటు ఇతర వస్తువులను విక్రయించేవాడని నిందితుడు గుల్ఫామ్ తెలిపాడు.
ఈ ఘటన జరగడానికి కొద్దిరోజుల ముందు గుల్ఫామ్, జాతవ్ దుకాణానికి వెళ్లి పెట్రోలు కొనుగోలు చేశాడట. డబ్బులు కూడా ఇచ్చాడట. కానీ గుల్ఫామ్ పది రూపాయలు తక్కువ ఇవ్వడంతో అతడిని 10 రూపాయలు ఇవ్వమని నిలదీశాడట. మిగిలిన బ్యాలెన్స్ మొత్తం ఇవ్వమని జాతవ్,గుల్ఫామ్ అడిగారట. అందుకు గుల్ఫామ్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.. ఈ క్రమంలోనే జాతవ్ డబ్బులు ఇవ్వకపోతే అంటూ చూస్తాను అని గుల్ఫామ్ ను బెదిరించాడట. దాంతో జాతవ్ పై కోపం పెంచుకున్న గుల్ఫామ్ అయినా ప్రతి కారం తీర్చుకోవాలి అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే జూన్ 12న రాత్రి గుల్ఫామ్, జాతవ్ ను కాల్చి చంపేశాడట. ఆ తర్వాత ఇక నుంచి పరారీ కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు గుల్ఫామ్ ను అరెస్టు చేశారు.