HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Why Nandiswara And Some Idols Drinks Milk In Some Times Science Says There Is The Scientific Reason

Science Mysteries : నంది విగ్రహం పాలు తాగడం వెనుక అసలు రహస్యం ఇదే! కొన్ని విగ్రహాలు ఎందుకు తాగవంటే..?

తెలుగు రాష్ట్రాల్లో నందీశ్వరుడి విగ్రహాలు పాలు తాగుతున్నాయి. కొద్ది రోజులుగా ఇదే హాట్ టాపిక్.

  • By Hashtag U Published Date - 10:54 AM, Wed - 9 March 22
  • daily-hunt
Nandi Milk
Nandi Milk

తెలుగు రాష్ట్రాల్లో నందీశ్వరుడి విగ్రహాలు పాలు తాగుతున్నాయి. కొద్ది రోజులుగా ఇదే హాట్ టాపిక్. గతంలో వినాయకుడి విగ్రహాలు కూడా పాలు తాగాయి అన్నారు. ఇప్పుడు నందీశ్వరుడి విగ్రహాల దగ్గర భక్తులు
క్యూ కడుతున్నారు. స్వయంగా వారి చేతులతో పాలు తాగిస్తున్నారు. ఇది సరే.. గతంలో పాలు తాగని నందీశ్వరుడు ఇప్పుడు ఎందుకు పాలు తాగుతున్నాడు? దీని వెనుక కారణాలేమిటి అన్నదానిపై సైన్స్ ఏం చెబుతోంది?

విగ్రహాలు పాలు తాగడం తెలుగునాట, దేశవిదేశాల్లో కొత్త కాదు. ఎందుకంటే వినాయకుడు మొదలు చాలా విగ్రహాలు గతంలో కూడా పాలు తాగాయి. నీళ్లు కూడా తాగాయి. అది భగవంతుడి మహిమే అని భక్తుల విశ్వాసం. కాదు దాని వెనుక సైన్స్ చెప్పిన సరైన కారణం ఉందన్నది శాస్త్రవేత్తల వాదన. దానికి తగ్గట్టే వాళ్లు ఇతర విగ్రహాలతో కూడా పాలు తాగిస్తున్నారు. అసలు అవి పాలను ఎలా తాగుతున్నాయి? వాటిని ఎలా జీర్ణం చేసుకుంటున్నాయి?

గత సంఘటనలను పరిశీలిస్తే.. సాయి బాబా విగ్రహం నుంచి విభూది రాలిన ఘటన ఉంది. అలాగే ఆ శ్రీరామచంద్రుడి ప్రతిమ కళ్ల నుంచి నీళ్లు కారాయి. దీంతోపాటు వినాయకుడి విగ్రహాలూ పాలు తాగిన ఘటనలు అందరికీ తెలుసు. ఇవన్నీ ఒకెత్తయితే.. ఇప్పుడు నందీశ్వరుడు పాలు తాగడం ఏమిటా అని భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ఆ శివుడి మహిమే అని పూజలు చేస్తున్నారు. కానీ సైన్స్ మాత్రం దీనికి కారణం తలతన్యత (Surface tension) అని చెబుతోంది. అసలీ తలతన్యత (surface tension) అంటే ఏమిటి?

తలతన్యత అంటే నీటితోపాటు ఇతర ద్రవపదార్థాలకు ఉన్న భౌతిక ధర్మం. దీనివల్లే విగ్రహాలు పాలు పీల్చుకుంటాయి. అది ఆ విగ్రహాలకున్న తేమను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే విగ్రహాలు ఒక్కోసారి పాలను కాని, నీళ్లను కాని తాగుతాయి. మరికొన్నిసార్లు అలా తాగలేవు. ఇక ఎలాంటి విగ్రహాలు పాలను తాగుతాయి అంటే.. ప్లాస్టరాఫ్ పారిస్ తో, మట్టితో, సుద్దతో, చెక్కముక్కలతో చేసిన విగ్రహాలు నీటిని లేదా పాలను పీల్చుకుంటాయి. రాయితో కాని లోహాలతో కాని చేసిన విగ్రహాలు ద్రవపదార్థాలను పీల్చుకున్నా.. పక్కనుంచి కారిపోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • idol
  • milk
  • science
  • special
  • surface tension
  • Telugu Real Mysteries

Related News

Ace Unit Kuppam

ACE Unit : కుప్పంలో రూ.305 కోట్లతో ACE యూనిట్

ACE Unit : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతం త్వరలో పాడి ఉత్పత్తుల పరిశ్రమలో కీలక కేంద్రంగా మారనుంది.

    Latest News

    • Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ ..15 నిమిషాల్లో బయటకి.!

    • Vizag Glass Bridge : నేడే గ్లాస్ బ్రిడ్జి (స్కైవాక్) ప్రారంభం

    • Harassment : లైంగిక వేధింపులు తట్టుకోలేక హీరోయిన్ కజిన్ ఆత్మహత్య

    • Samantha 2nd Wedding : సమంత రెండో వివాహం చేసుకోబోయేది ఈరోజేనా..?

    • Venky-Trivikram : వెంకీ – త్రివిక్రమ్ మూవీకి క్రేజీ టైటిల్!

    Trending News

      • AIDS Day : ఎయిడ్స్ కేసుల్లో టాప్ లో ఏపీ

      • Virat Kohli: వ‌న్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ చేసిన సెంచ‌రీ సంఖ్య ఎంతో తెలుసా?

      • Most Matches: రోహిత్ శ‌ర్మ- విరాట్ కోహ్లీ జోడీ.. భార‌త్ త‌ర‌పున స‌రికొత్త రికార్డు!

      • Rohit Sharma: ప్ర‌పంచ రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శ‌ర్మ‌!

      • Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు మ‌ళ్లీ తిరిగి వ‌స్తాడా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd