No Selfies Day: ఈరోజు ‘నో సెల్ఫీస్ డే’.. మనం కూడా పాటిస్తామా?
ప్రతి సంవత్సరం మార్చి 16ను ‘నో సెల్ఫీస్ డే’గా నిర్వహిస్తారు. స్మార్ట్‌ఫోన్ లు రాక ముందు నుంచే సెల్ఫీలున్నాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో ‘సెల్ఫీ’ పదం
- By Maheswara Rao Nadella Published Date - 12:20 PM, Thu - 16 March 23

ప్రతి సంవత్సరం మార్చి 16ను ‘నో సెల్ఫీస్ డే’ (No Selfies Day) గా నిర్వహిస్తారు. స్మార్ట్‌ఫోన్ లు రాక ముందు నుంచే సెల్ఫీలున్నాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో ‘సెల్ఫీ’ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇటీవలి కాలంలో చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెల్ఫీ స్టిక్‌లు, ఫోన్ కెమెరాలోని ఆప్షన్లతో ఫొటోలు తీసుకోవడం సులభంగా మారింది. సెల్ఫీలు తీసుకోవడం మీకు ఎంత ఇష్టమైనా ఇవాళ మాత్రం నో సెల్ఫీడేను పాటించాలని కొందరు చెబుతున్నారు. నిజానికి ఈ ‘నో సెల్ఫీ డే’ను ఎవరు కనిపెట్టారో ఎవరికీ తెలియదు. ఎప్పటి నుంచి పాటిస్తున్నారనే దానికి కచ్చితమైన ఆధారాలూ లేవు. అయితే ఈ రోజునే సెల్‌ఫోన్ కెమెరాను కనిపెట్టిన ఫిలిప్ కాన్ పుట్టినరోజు కావడం యాదృచ్ఛికం. ఇవాళ విపరీతంగా సెల్ఫీలు తీసుకునే వారిని మిగతావారు లక్ష్యంగా చేసుకుంటారు. అందుకే సెల్ఫీ తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నిద్దాం..
వ్యసనం కారణంగా వ్యాధి
ఇక సెల్ఫీ వ్యసనం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం ఒక మహిళ మంచి సెల్ఫీ ఎలా తీసుకోవాలో ఆలోచిస్తూ వారంలో 104 నిమిషాల పాటు కాలం వెల్లదీస్తుందట. నలుగురిలో ఉన్నప్పుడు తమను ప్రత్యేకంగా గుర్తించాలని కూడా కొందరు సెల్ఫీలు తీసుకుంటారని వెల్లడైంది. అలా చేయడం వల్ల ప్రశంసలు లభిస్తాయని సెల్ఫీలు తీసుకునే వారు ఆశిస్తారట. సెల్ఫీలు తీసుకోవడానికి ప్రత్యేకంగా మార్కెట్లోకి వచ్చిన లైట్స్, ఫోన్‌లోని ఫిల్టర్లు, ఎఫెక్ట్స్ వాడి అసలు రూపం కంటే అందంగా కనిపించడానికి ఆరాటపడుతున్నారు. కొంతకాలం కిందట తీసుకున్న అలాంటి సెల్ఫీలను చూసి అప్పట్లో తాము అందంగా, నాజూకుగా ఉండేవారమనే అభిప్రాయానికి వస్తున్నారు. ఇది కూడా ఒక రకమైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. తాము మునుపటిలా కనిపించడం లేమని బాధపడటాన్ని వైద్యపరిభాషలో ‘డెస్మోర్ఫియా’ అంటారు. వీరు ఎక్కువ సమయం తమ ప్రతిబింబాలను, ఫొటోలను చూసుకుంటూ బాధపడుతుంటారు.
విమర్శిస్తే కుంగుబాటు!
సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన సెల్ఫీలకు వచ్చే అభినందనలు, విమర్శలు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఎవరైనా ఫొటోను డిస్‌లైక్ చేసినా.. అది బాగా లేదని కామెంట్ చేసినా మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నట్లు వెల్లడైంది. ‘నో సెల్ఫీస్ డే’ (No Selfies Day) పాటిస్తే ఆ అనుభవాన్ని ఒక రోజు దూరం చేసుకోవచ్చని పలువురు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
సెల్ఫీ గురించి కొన్ని విశేషాలు..
- యూఎస్‌కు చెందిన కార్నీలియస్ 1839లో మొట్టమొదటి సెల్ఫీ తీసుకున్నాడు.
- ప్రపంచంలో నిత్యం 9.2 కోట్ల సెల్ఫీలు తీసుకుంటున్నారు.
- సెల్ఫీ తీసుకుంటుంటే 60% మంది నవ్వుతారు.
- సెల్ఫీ తీసుకునే క్రమంలో ఏటా సగటున 43 మంది చనిపోతున్నారు. వేల సంఖ్యలో గాయపడుతున్నారు.
- ‘సెల్ఫీ’ అనే పదం 2013లో వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటు సంపాదించింది.
Also Read: Rishi Sunak: మరోసారి వివాదంలో చిక్కుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్..

Related News

Loneliness & Silence: ఒంటరితనమే లోకం.. నిశ్శబ్దమే బంధువుగా వృద్ధుల టౌన్
మన దేశంలో జనాభా పెరుగుతూ పోతోంది. చైనాను కూడా ఇండియా దాటేసే రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ టైంలోనూ కేరళలోని పతనంతిట్టా జిల్లా నడిబొడ్డున ఉన్న కుంబనాడ్..