Tamil Nadu Nutmeg : తమిళనాడు జాజికాయలకు విదేశాల్లో భారీ డిమాండ్..!
భారతీయుల పురాతన కాలం నుంచి వంటకాల్లో జాజికాయలను ఉపయోగించడం తెలిసిందే. వంటలకు మంచి రుచి, వాసన వచ్చేలా చేస్తుంది జాజికాయ (Nutmeg).
- Author : Ramesh
Date : 18-09-2023 - 7:23 IST
Published By : Hashtagu Telugu Desk
Tamil Nadu Nutmeg : భారతీయుల పురాతన కాలం నుంచి వంటకాల్లో జాజికాయలను ఉపయోగించడం తెలిసిందే. వంటలకు మంచి రుచి, వాసన వచ్చేలా చేస్తుంది జాజికాయ (Nutmeg). అంతేకాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. పొరుగు రాష్ట్రం తమిళనాడులో (Tamil Nadu) జాజికాయ సాగు బాగా జరుగుతుంది. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి కోట్టూరు, అనమలై ఇంకా రాష్ట్ర సరిహద్దుల్లో కూడా జాజికాయ సాగు చేస్తుంటారు.
ఈమధ్యనే 25 టన్నుల జాజికాయ (Nutmeg) విదేశాలకు ఎగుమతి చేశారని ఉత్పత్తిదారులు వెల్లడించారు. అనమలై, కోట్టూరు లో కొబ్బరితో పాటుగ అంతర పంటగా జాజికాయ సాగు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా జాజికాయ, జాపత్రి సాగు జరుగుతున్నా ఇక్కడ మేలు రకం అనిపిస్తుండటం వల్ల ఇక్కడ నుంచి ఎక్కువ ఎగుమతులు జరుగుతాయని తెలుస్తుంది. ప్రతి ఏడాది జూన్ నుంచి నవంబర్ వరకు జాజికాయల (Nutmeg) సీజన్ నడుస్తుంది.
25 టన్నుల జాజికాయలను 1.18 కోట్లకు సేల్ చేశారు. ఫారిన్ లో జాజికాయలకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ప్రతి సూప్ లో దీని పొడి వేస్తారు. అంతేకాదు జాజికాయ వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జాజికాయ పొడి గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలను సాల్వ్ చేస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ.. రక్తనాళాల్లో కొవ్వు కరిగించడంలో జాజికాయ ఉపయోగపడుతుంది. నిద్ర సరిగా రాని వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
Also Read: Assam School : పాత ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే ఆ స్కూల్ అడ్మిషన్ కన్ఫర్మ్..!