Vava Suresh : కోలుకుంటున్న స్నేక్ మ్యాన్ ఆఫ్ కేరళ
స్నేక్ మ్యాన్ ఆఫ్ కేరళగా పాపులర్ అయిన వావా సురేష్ చావు అంచులదాకా వెళ్లి బయటపడ్డాడు.
- Author : Hashtag U
Date : 03-02-2022 - 2:49 IST
Published By : Hashtagu Telugu Desk
స్నేక్ మ్యాన్ ఆఫ్ కేరళగా పాపులర్ అయిన వావా సురేష్ చావు అంచులదాకా వెళ్లి బయటపడ్డాడు. ఈ మధ్యనే ఒక కోబ్రాను పడుతూ దాని కాటుకు గురైన సురేష్.. దాదాపు వారం పాటు వెంటిలేటర్‌పై ఉన్నాడు. అతననిని కొట్టయాం మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో చేర్పించారు. తాజాగా ఆయన తనకు తానుగా శ్వాస తీసుకుంటున్నాడని వైద్యులు చెప్పారు.
ఇప్పటికి ఏకంగా 50వేలకుపైగా పాములను పట్టుకున్న వావా సురేష్ అంటే కేరళలో తెలియని వాళ్లు ఉండరు. సురేష్‌పై ఏకంగా నేషనల్ జియోగ్రఫీ, యానిమల్ ప్లానెట్ ఛానళ్లు డాక్యుమెంటరీలు తీశాయి. సురేష్ 190 కింగ్ కోబ్రాలను రక్షించాడు. జనవరి 31న కొట్టయాంలో కోబ్రాను పట్టుకుంటుండగా దాని కాటుకు గురయ్యాడు. గత ఏడాది కూడా ఇలానే ఓ సారి పాముకాటుకు గురై చికిత్స తీసుకున్నాడు.
కొట్టయాం చుట్టుపక్కల ఎక్కడ పాములు కనిపించినా అక్కడ సురేష్ ప్రత్యక్షమవుతాడు. అతనికి కేరళ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగం ఆఫర్ చేసినా కూడా అతను దానిని సున్నితంగా తిరస్కరించాడు.