Singer Smita: బ్యూటీ ప్రొడక్ట్స్ కు కేరాఫ్ అడ్రస్ స్మిత ‘ఓల్డ్ స్కూల్’
చర్మ సంరక్షణ కోసం ఓల్డ్ స్కూల్ అనే ప్రాజెక్టును ప్రారంభించి తిరుగులే బ్రాండ్ తో దూసుకెళ్లుతోంది.
- By Balu J Published Date - 06:20 PM, Wed - 25 October 23
Singer Smita: సింగర్ స్మిత అనగానే ఎన్నో పాప్ సాంగ్స్ కళ్ల ముందు కదలాడుతాయి. ఆమె సింగర్ గానే కాకుండా నటిగా, వాణిజ్యవేత్తగా, హోస్ట్ గానూ ఎంతోమందికి తెలుసు. మన సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా జరిగిపోతుంది అనే మాటలను నమ్మే స్మిత ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమవుతూనే ఉంటుంది. తాజాగా ఆమె చర్మ సంరక్షణ కోసం ఓల్డ్ స్కూల్ అనే ప్రాజెక్టును ప్రారంభించి తిరుగులే బ్రాండ్ తో దూసుకెళ్లుతోంది.
స్మిత అందాల వ్యాపారంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి కాదు. ఆమె 20 సంవత్సరాల క్రితం ప్రారంభించిన బబుల్స్ హెయిర్ & బ్యూటీ అనే సెలూన్ల తో తన ప్రత్యేకత చాటుకుంది. 43 ఏళ్ల వయసులో ఆమె ఓల్డ్ స్కూల్ ద్వారా తెలుగు ప్రజలకు అనేక బ్యూటీ బ్రాండ్ ప్రోడక్ట్స్ అందిస్తోంది. మార్కెట్లో అనేక రసాయన ప్రోడక్ట్స్ చూసిన స్మిత సహజంగా చర్మ సంరక్షణ ఉత్పత్తులను చేయాలని గట్టిగా నిర్ణయించుకొని ఓల్డ్ స్కూల్ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఆమె తయారు చేసిన ఉత్పత్తులు చాలా సహజమైనవి, చర్మానికి మేలు చేసేవి కూడా. ఇప్పటికే స్మిత తయారుచేసిన అనేక ప్రోడక్ట్స్ తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల దొరుకుతున్నాయి. బ్యూటీ బ్రాండ్ 30కి పైగా ఉత్పత్తులను అందిస్తున్నారంటే స్మిత ప్రత్యేకత ఎంటో ఇట్టే అర్ధమవుతోంది.
దక్షిణ భారతదేశంలో పాతుకుపోయిన పురాతన ఆచారాల స్మిత చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తోంది. దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు, అరటి, మామిడి వంటి పండ్లు, బియ్యం, క్యారెట్, బీట్రూట్, బంగాళాదుంప మరియు పుదీనా వంటి వంట ప్రధాన పదార్థాలు లాంటివాటితో సహజ ఉత్పత్తులను తయారు చేస్తూ తనకంటూ ఓ పేరు తెచ్చుకుంది.
‘‘ఓల్డ్ స్కూల్ ఇప్పుడు ఏడేళ్లుగా కలల ప్రాజెక్ట్. నా కుమార్తె శివికి నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, మేం మా ఇంటి వంటగది నుండి పిల్లలు, తల్లులకు రిటర్న్ గిఫ్ట్‌లుగా అందించడానికి వస్తువులను ఎంచుకోవడం ప్రారంభించాం, తద్వారా సహజమైన ఉత్పత్తులను అందించి చర్మ సంరక్షణకు తోడ్పడ్డాం. అయితే, ఇంతకు ముందు కూడా, నేను మా నాన్నతో పాటు అనేక బ్యూటీ, స్కిన్‌కేర్, కాస్మెటిక్స్ ఫెయిర్లకు వెళ్లాను, స్కిన్‌కేర్ పరిశ్రమపై లోతైన అవగాహన పొందాలనే లక్ష్యంతో ఓల్డ్ స్కూల్‌ను ప్రారంభించాను. ఓల్డ్ స్కూల్ ప్రొడక్స్స్ ను గత ఐదేళ్లలో రెండు లక్షల మంది కస్టమర్లు పరీక్షించారు. అంతేకాదు.. చాలామంది ఇష్టపడుతున్నారు. మా సర్వీస్ కిట్లలో భాగంగా ఉత్పత్తులు మా సెలూన్ల ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉండేవి. జుట్టు, శరీరం అన్ని రకాల బ్యూటీ ప్రోడక్స్ అందిస్తుండటంతో తక్కువ కాలంలోనే మంచి పేరు వచ్చింది’’ అని చెప్పింది స్మిత
Also Read: Thalaivar 170: ఇద్దరు లెజెండ్స్ కలిసిన వేళ.. అమితాబ్ తో రజనీ స్క్రీన్ షేర్
Related News
Tonsils : టాన్సిల్స్ వేధిస్తున్నాయా ? ఆయుర్వేద టిప్స్ ఇవిగో
Tonsils : టాన్సిల్స్ సమస్య చాలామందిని వేధిస్తుంటుంది.