HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Private Space Agencies Looking Towards India

Private Satellites: భారత్ వైపు చూస్తున్న ప్రైవేటు అంతరిక్ష సంస్థలు

భారతదేశం మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి ప్రైవేట్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది.

  • Author : HashtagU Desk Date : 29-11-2022 - 8:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rocket Launch
Rocket Launch

భారతదేశం మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి ప్రైవేట్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది. స్కైరూట్ అనే ప్రైవేటు సంస్థ తయారుచేసిన ప్రారంభ్ అనే రాకెట్ కు శ్రీహరికోట ఇస్రో అంతరిక్ష కేంద్రం వేదికైంది. అంతరిక్ష పరిశోధనల కోసం భారతదేశం ఖర్చు చేస్తున్న నిధులు అమెరికా, చైనాలతో పోల్చితే శూన్యం అనే చెప్పాలి. గ్లోబల్ స్పేస్ మార్కెట్ లో భారతదేశం వాటా 2 శాతం మాత్రమే. అయితే నేడు ఈ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు భారత అంతరిక్ష రంగాన్ని మరింత ముందుకు తీసుకుపోవడంలో సహాయపడతాయని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశం 2020 వ సంవత్సరం నుంచి అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తోంది. అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి లభించడంతో వారు రాకెట్లు, ఉపగ్రహాలను దేశీయంగా తయారు చేయడం మొదలుపెట్టారు. ప్రైవేటు వారు తయారు చేసిన రాకెట్లను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రో ప్రయోగ సౌకర్యాలను వినియోగించుకునేందుకు కూడా భారత ప్రభుత్వం అవకాశం కల్పించింది.

గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారతదేశం తన వాటాను విస్తరించుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. 2 శాతం ఉన్న భారత షేర్ 8-10 శాతం వరకు పెంచాలని కూడా టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు, ఇస్రోల మధ్య సమన్వయం చేసేందుకు ప్రభుత్వం ఇన్‌స్పేస్‌ అనే ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేసింది. 2019 లో 7 బిలియన్ల డాలర్ల విలువగల భారత అంతరిక్ష పరిశ్రమను 2024 నాటికి 50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలను అనుమతించిన తర్వాత ఇస్రోతో మొదటి ఒప్పందం చేసుకున్న ప్రైవేటు స్టార్టప్ సంస్థ స్కైరూట్. స్కైరూట్ తో సహా ఇప్పటికి దాదాపు 100 స్టార్టప్‌ సంస్థలు ఇస్రోతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో స్కైరూట్ రికార్డు స్థాయిలో 51 మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చుకుంది. ఇది భారతీయ అంతరిక్ష సాంకేతిక రంగంలో అతిపెద్ద నిధుల సమీకరణ. దాదాపు 10 ఇతర ప్రైవేట్ సంస్థలు సైతం అంతరిక్ష పరిశోధనలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇతర సంస్థలు ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నాయి.

ఫిక్సెల్ అనే స్టార్టప్ మైనింగ్, విపత్తు నిర్వహణలో సహాయపడే చిత్రాలను అందించడంలో పని చేస్తోంది. బెంగుళూరుకు చెందిన దిగంతరా అనే స్టార్టప్ అంతరిక్ష వ్యర్థాలను మ్యాపింగ్ చేస్తోంది. ధృవ, అగ్నికుల్, బెల్లాట్రిక్స్ వంటి ఇతర కంపెనీలు కూడా తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
ప్రైవేటు స్పేస్ సంస్థలు అభివృద్ధి చెందితే భారతీయ యువకులు తమ కలల సాకారానికి విదేశాలు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దేశంలోనే పని చేసుకోవడానికి వారికి మరిన్ని అవకాశాలు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గత కొన్నేళ్లుగా ఇస్రో తక్కువ ఖర్చుతో పరిశోధనలు చేస్తూ విశ్వసనీయ భాగస్వామిగా ఖ్యాతి గడించింది. అంతేకాకుండా ఇస్రో తన సొంత పరిశోధన-ఆధారిత అంతరిక్ష ప్రయోగాలను చేయడమే కాకుండా, దాదాపు 30 దేశాలకు చెందిన 450 ఉపగ్రహాలను ప్రయోగించడంలో సహాయపడేందుకు విదేశాలతో ఒప్పందాలు చేసుకుంది.
రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కూడా భారత్‌కు మరిన్ని అవకాశాలను కల్పించిందనే చెప్పాలి. యుద్దం కారణంగా మాస్కోపై ఆంక్షల విధింపుతో రష్యా, ఇతర దేశాల రాకెట్ల ప్రయోగాలను నిలిపివేయవలసి వచ్చింది. దీంతో అనేక కంపెనీలు భారత్ వైపు చూసే పరిస్థితి ఏర్పడింది.

భారత దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ఆర్థిక మద్దతు ఉన్న లండన్‌కు చెందిన శాటిలైట్ కంపెనీ వన్ వెబ్ తన ఉపగ్రహాల ప్రయోగం కోసం భారతదేశం వైపు మొగ్గు చూపింది. ఈ ఏడాది అక్టోబరులో ఇస్రో వన్ వెబ్ కు చెందిన 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. దీంతో అంతరిక్షంలో వన్ వెబ్ పంపిన ఉపగ్రహాల సంఖ్య 462కి చేరింది. మొత్తం 648 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని ప్రణాళికలు చేసుకున్న వన్ వెబ్ రష్యా ఉపసంహరణతో ఆ మిగిలిన ఉపగ్రహాలు భారత్ ద్వారా పంపాలని నిర్ణయించుకుంది. భారత్‌కు ఇది అత్యద్భుతమైన అవకాశం. మరి భవిష్యత్తులో భారత్ ఏ విధంగా ఈ మైలు రాళ్లను అధిగమిస్తుందో చూడాలి. ఒకేసారి విజయవంతగా 30-40 ఉపగ్రహాలను ప్రయోగించిన భారత్ వైపు ప్రపంచ అంతరిక్ష మార్కెట్ ఆసక్తిగా చూస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • isro
  • private satellite
  • Skyroot
  • space

Related News

Lab-grown diamond lotus to create history in space!

Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

భారత్‌ అంతరిక్ష రంగంలో మరో అరుదైన ఘట్టానికి వేదిక కానుంది. దేశంలోని తొలి ప్రైవేటు ఆర్బిటల్‌ రాకెట్‌ విక్రమ్-1 ప్రయోగంలో ప్రత్యేకంగా రూపొందించిన ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం అంతరిక్షంలోకి ప్రయాణించనుంది. బెంగళూరుకు చెందిన కాస్మోస్‌ డైమండ్స్‌ ఈ విశిష్ట కళాఖండాన్ని రూపొందించగా, భారతదేశంలో తయారైన ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కళాఖండం అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశ

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd