NTR Icon : థెరీస్సా ఆహ్వానంపై ఎన్టీఆర్ డేరింగ్ తిరస్కారం
ఎన్టీఆర్ అప్పట్లో చేసిన ధైర్యం(NTR Icon) ఇప్పుడున్న లీడర్లు చేయగలరా? అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే, రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవు.
- By CS Rao Published Date - 02:55 PM, Mon - 15 May 23

స్వర్గీయ ఎన్టీఆర్ అప్పట్లో చేసిన ధైర్యం(NTR Icon) ఇప్పుడున్న లీడర్లు చేయగలరా? అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే, రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవు. కేవలం అధికారం కోసం ఎన్ని తప్పులైనా చేసే సిద్దాంతం ఇప్పుడున్నది. అందుకే, స్థిరమైన నిర్ణయాలు ఉండవు. మత, కుల, ప్రాంత పునాదులపై రాజకీయాలు నడిపే సంస్కృతి వచ్చేసింది. వాటిని కాదని నడిచే ధైర్యం ఉన్న లీడర్లు దాదాపుగా ఎవరూ లేరని చెప్పాలి. కానీ, ఎన్టీఆర్ అందరికీ భిన్నం. ఆయన నమ్మిన సిద్ధాంత కోసం సర్వం కోల్పోడానికి కూడా సిద్దపడ్డారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం మదర్ థెరీసా(Mother Teresa) ప్రతిపాదనను ఆయన తిరస్కరించడం.
స్వర్గీయ ఎన్టీఆర్ అప్పట్లో చేసిన ధైర్యం(NTR Icon)
ఎన్టీఆర్ (NTR Icon) ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మరుసటి ఏడాది అంటే 1984 సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల తెలుగు సదస్సుకు హాజరయ్యారు. ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఆ సమావేశంలో ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా హాజరయ్యారు.అనుకోకుండా, ఎన్టీఆర్, మదర్ థెరీసా(Mother Teresa) కలవడం జరిగింది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పునాదులను లేసేసిన తెలుగు తేజం ఎన్టీఆర్ ను చూసి థెరీసా అభివందనం చేశారట. అక్కడున్న వాళ్లు ఆశ్చర్యపోయారని కొందరు చెబుతుంటారు. అంటే, 1983 – 1984 ప్రాంతంలో ఎన్టీఆర్ ఆల్ ఇండియా ఐకాన్ గా పాపులర్ వ్యక్తి గా క్రేజీ వచ్చిన రోజులవి.
కాథ్యాలిక్ నన్ గా సంఘ సేవకురాలైన మదర్ థెరీసా
థెరీసా ఐర్లాండ్ దేశస్తురాలు. భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న మతపరమైన కాథలిక్ నన్ . ఛారిటీ మిషనరీ సంఘ సేవకురాలు. అనుకోకుండా ఒక కార్యక్రమంలో ఎన్టీఆర్ ను కలిసారు. ఒక కాథ్యాలిక్ నన్ గా సంఘ సేవకురాలైన మదర్ థెరీసా (Mother Teresa) ఎన్టీఆర్ గురించి ఆయన ప్రిన్సిపుల్స్ గురించి చెప్పడం ఆశ్చర్యం కలిగించిందట. ఆమెకు ఎన్టీఆర్ (NTR Icon)జీవన శైలి, క్రమశిక్షణ, స్థిరమైన నిర్ణయాలు లీడర్ గా అవగాహన ఉండటం విశేషం. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడుగా,తెలుగు ప్రాంతీయ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఎన్టీఆర్ ని సాదరంగా కలుసుకొన్నది మదర్ థెరీసా. ఎన్టీఆర్ వ్యక్తిత్వం, జనాదరణ,మాట తీరు, చొరవ ఆ చరిష్మా చూసి మదర్ థెరీసా తాను నడిపే మతపరమైన సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆహ్వానించారట. ఆమె చేసే సేవా ప్రచార విభాగంలో సేవకు ఆహ్వానించింది.
Also Read : CBN: పబ్లిక్ పాలసితోనే ప్రగతి: చంద్రబాబు
ఒక విలక్షణమైన, సుస్థిర అభిప్రాయం సొంత నిర్ణయం కలిగిన వ్యక్తిత్వం నిర్దుష్టమైన స్వధర్మ నిష్ఠ కలిగిన మన ఎన్టీఆర్ (NTR Icon) ఆమె ఆహ్వానంపై సూటిగా మాట్లాడారట. దీంతో మదర్ థెరీసా కూడా ఆశ్చర్య పోయారని ఆ రోజుల్లో ఉన్న వాళ్లు చెబుతారు. థెరస్సాతో “మీ యొక్క ప్రతిపాదనం,సౌభ్రాతృత్వానికి ధన్యవాదాలు. నేను ఒక భారతీయ పౌరుడిని, నాకంటు కొంత స్వంత అభిప్రాయాలు, నిర్ణయాలు కలువు అలాగే, మా మతం వేరు అభిమతం వేరు. వ్యవహార శైలి పూర్తిగా భిన్నం. మీ సహృదయతకు వందనాలు దయచేసి మీరు ఈవిషయంలో మీతో ఏకీభవించలేను అన్యధా భావించవద్దు` అంటూ ఎన్టీఆర్ చాలా మర్యాద పూర్వకంగా నిష్పక్షపాతంగా ఉన్నదున్నట్లు చెప్పడం అక్కుడున్న వాళ్లను ఆశ్చర్యానికి గురిచేసిందట.
Also Read : TDP Janasena: బీజేపీలేని కూటమి దిశగా టీడీపీ, జనసేన
ఒక ఖచ్చితమైన, సంపూర్ణ స్థిర అభిప్రాయ విలువలు కలిగిన ఎన్టీఆర్ లాంటి వ్యక్తిత్వం ఉండే లీడర్లు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఆచరణీయం, ఆమోదయోగ్యం మార్గదర్శనం సజీవ సాక్ష్యంగా నిలిచిన ఎన్టీఆర్ మాదిరిగా ఉండేళ్ల రాజకీయ నేతలు ఇప్పుడు అరుదు. ఎక్కడకు వెళితే , ఆ వేషం వేసే లీడర్లకు ఆనాడు ఎన్టీఆర్ వ్యవహరించిన తీరును గుర్తుపెట్టుకోవాలని పలువురు కోరుతున్నారు. థెరిస్సా(Mother Teresa) ఆహ్వానం లభిస్తే చాలనుకునే రోజుల్లో ఎన్టీఆర్ ఆమె ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీ వాళ్లు ఇప్పుడు గుర్తు చేసుకోవడం గమనార్హం.

Related News

CBN Plan : మోడీతో బాలయ్య భేటీ? భారత రత్న, పొత్తు ఎజెండా!
తెలుగుదేశం, బీజేపీ మధ్య జరుగుతోన్న దోబూచులాటకు హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలక్రిష్ణ (CBN Plan) తెరదించబోతున్నారు.