Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్.. మంత్రిత్వ శాఖలకు నయా ఫార్ములా?!
ఎన్‌డీఏ కూటమిలో మంత్రిత్వ శాఖల పంపిణీపై కూడా ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. అందుతున్న వివరాల ప్రకారం.. ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అనే ఫార్ములాను అమలు చేయనున్నారు.
- By Gopichand Published Date - 09:05 PM, Mon - 17 November 25
Nitish Kumar: బీహార్‌లో ఎన్‌డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియ వేగవంతమైంది. పట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్‌లో నవంబర్ 20న అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అధికార యంత్రాంగాన్ని ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొత్త ప్రభుత్వ రూపురేఖలు దాదాపుగా ఖరారయ్యాయి.
ఎన్‌డీఏ కూటమిలో మంత్రిత్వ శాఖల ఫార్ములా ఖరారు
ఎన్‌డీఏ కూటమిలో మంత్రిత్వ శాఖల పంపిణీపై కూడా ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. అందుతున్న వివరాల ప్రకారం.. ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అనే ఫార్ములాను అమలు చేయనున్నారు. ఇదే ప్రాతిపదికన మిత్రపక్షాల కోటా నిర్ణయించబడుతోంది. నవంబర్ 20న నితీష్ కుమార్‌తో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయవచ్చని, ఆ తర్వాత మరో 14 మంది మంత్రులను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే నితీష్ కుమార్ ప్రభుత్వంలో మొత్తం 34 మంది మంత్రులకు చోటు దక్కనుంది.
Also Read: Local Body Elections: సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. అప్పుడే నోటిఫికేషన్!?
మంత్రిత్వ శాఖల కోటా (అంచనా)
- బీజేపీ కోటా: 15 మంది మంత్రులు
- జేడీయూ కోటా: 14 మంది మంత్రులు (ముఖ్యమంత్రి సహా)
- లోజ్‌పా (ఆర్) కోటా: 3 మంత్రులు
- హమ్ (HAM) కోటా: 1 మంత్రి
- ఆర్ఎల్‌ఎం (RLM) కోటా: 1 మంత్రి
బీజేపీ, జేడీయూ- మిత్రపక్షాల మంత్రివర్గం
కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ముందు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్న నేతల జాబితా కూడా బయటకు రావడం మొదలైంది. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య ఈ విషయంలో లోతైన చర్చలు జరుగుతున్నాయి.
బీజేపీ కోటా నుండి పేర్లు
సమ్రాట్ చౌదరి, రాంకృపాల్ యాదవ్, నితిన్ నవీన్, మంగళ్ పాండే, హరి సహాని, విజయ్ సిన్హా.
జేడీయూ కోటా నుండి మంత్రులు
విజయ్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్, అశోక్ చౌదరి, లేషి సింగ్, మదన్ సహాని, జయంత్ రాజ్, సునీల్ కుమార్. ఈ నాయకుల పేర్లు మరోసారి మంత్రివర్గంలో చేరేందుకు చర్చలు జోరందుకున్నాయి.
ఇతర మిత్రపక్షాల ప్రాతినిధ్యం
ఎల్జేపీ (ఆర్) నుండి: రాజు తివారీ, సంజయ్ పాశ్వాన్, రాజీవ్ రంజన్ సింగ్ (దేహ్రి)
హమ్ (HAM) నుండి: సంతోష్ సుమన్ (జీతన్ రామ్ మాంఝీ కుమారుడు)
ఆర్ఎల్‌ఎం (RLM) నుండి: స్నేహలత కుష్వాహ (ఉపేంద్ర కుష్వాహ సతీమణి)