Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి అండతో 75 ఏళ్ల ఇబ్బందులకు ముగింపు
ఈ కాలక్రమంలో ఆ గ్రామస్థుల సమస్య వినడానికి ముందుకొచ్చిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి.
- By Dinesh Akula Published Date - 11:12 AM, Sun - 21 September 25
 
                        Nara Bhuvaneshwari: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఎస్ గొల్లపల్లి గ్రామంలో సుమారు 500 మంది జనాలు ఇళ్ల్లో నివసిస్తున్నారు. ఈ గ్రామం దగ్గర నుంచి సరైన రోడ్డు లేకపోవడం వల్ల 75 ఏళ్లుగా ఆ ప్రాంత ప్రజలు తీవ్ర సమస్యలతో ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు బడి చేరుకోవడంలో ఇబ్బందులు పడతుంటే, తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరుకోవడం పెద్ద సవాలు అయిపోయింది. 75 సంవత్సరాలుగా రోడ్డు సమస్యపై గ్రామస్తులు ఎన్నో సార్లు అధికారుల దరఖాస్తులు చేస్తూ పోయినా, ఎవరూ పట్టించుకోలేదు.
ఈ కాలక్రమంలో ఆ గ్రామస్థుల సమస్య వినడానికి ముందుకొచ్చిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి. ఇటీవల ఆమె రామకుప్పం మండలంలోని పల్లికుప్పం, కావలిమడుగు, ఎస్ గొల్లపల్లి, గడ్డూరు, పంద్యాలమండుగు గ్రామాలను సందర్శించారు. గొల్లపల్లి గ్రామాన్ని చూసిన తరువాత, అక్కడి విద్యార్థులు తమ ఇబ్బందులు ఆమెకు వివరించారు. వారికి సహానుభూతితో స్పందించిన నారా భువనేశ్వరి, ఆ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పని ప్రారంభించారు.
ఆరు నెలల్లోనే ఆ గ్రామానికి కొత్త రోడ్డు ఏర్పాటుపై చర్యలు తీసుకుని, గత 75 ఏళ్ల ఇబ్బందులకు చుక్కెదుర్చారు. ఇప్పటికీ ఆ గ్రామస్తులు నారా భువనేశ్వరి కు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆమె ఆ గ్రామ ప్రజల ఆవేదనల్ని గ్రహించి, తీర్పు తీసుకుని, ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించింది.
ఇలా ఒక అసాధారణ దృష్టితో, సామాన్య ప్రజల జీవితంలో తగిన మార్పు తీసుకురావడంలో నారా భువనేశ్వరి చేసిన ప్రయత్నం ప్రశంసనీయంగా నిలిచింది.