Milkha Singh : ఫ్లయింగ్ సిఖ్.. పట్టుదలకు మారుపేరు మిల్కా
Milkha Singh : ఇవాళ స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి స్టార్ అథ్లెట్ మిల్కాసింగ్ జయంతి.
- By Pasha Published Date - 03:33 PM, Mon - 20 November 23

Milkha Singh : ఇవాళ స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి స్టార్ అథ్లెట్ మిల్కాసింగ్ జయంతి. ప్రస్తుత పాకిస్థాన్‌లోని గోవింద్‌పురాలో సిక్కు కుటుంబంలో 1929 నవంబర్ 20న ఆయన జన్మించారు. 1947లో భారత్, పాక్ విడిపోయిన తర్వాత మిల్కా సింగ్ పాక్ నుంచి ఇండియాకు వలస వచ్చారు. తొలుత సైన్యంలో చేరారు. అక్కడే ఆయన రన్నింగ్‌లో ఎంత ఫాస్టో అందరికీ తెలిసొచ్చింది. దాదాపు 400 మంది సైనికులు పరుగెత్తే క్రాస్-కంట్రీ రేసులో మిల్కా ఆరో స్థానంలో నిలిచారు. ఇదే ఆయన గొప్ప అథ్లెట్‌గా నిలిచేందుకు మైలురాయిగా నిలిచింది. తదుపరి శిక్షణ కోసం మిల్కాను భారత సర్కారు ఎంపిక చేసింది. 1956లో మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో, 1960లో రోమ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో, 1964లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారతదేశానికి మిల్కా ప్రాతినిధ్యం వహించారు.
Also Read: Lawyers Vs ChatGPT : లాయర్లకు ‘ఛాట్ జీపీటీ’ ఝలక్.. నమ్ముకుంటే నట్టేట ముంచుతోందట !
1956 మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో మిల్కా సింగ్ 200 మీటర్ల, 400 మీటర్ల హీట్ దశలను దాటి ముందుకు సాగలేకపోయారు. అయితే ఆ టైంలో ఛాంపియన్‌గా నిలిచిన చార్లెస్ జెంకిన్స్‌తో కలిసి ఆయన సలహాలు తీసుకున్నారు. అవే మిల్కాను ఫ్యూచర్ స్టార్ అథ్లెట్‌గా తయారు చేశాయి. ఒక దృఢ నిశ్చయంతో మిల్కా సింగ్ మెల్బోర్న్ నుంచి ఇండియాకు వచ్చారు. తనను తాను నడుస్తున్న యంత్రంగా మార్చుకోవాలని ఆనాడే మిల్కా నిశ్చయించుకున్నారు. ఆ కోరిక ఫలితంగా 1958లో స్వతంత్ర భారతదేశం నుంచి కామన్వెల్త్ గేమ్స్‌లో మొదటి బంగారు పతక విజేతగా మిల్కా సింగ్ నిలిచారు.
We’re now on WhatsApp. Click to Join.
మిల్కా సింగ్ బాల్యంలో పాకిస్థాన్‌లో ఉండగా మత అల్లర్లు జరిగాయి. అతడి తల్లిదండ్రులు హత్యకు గురయ్యారు. ఈనేపథ్యంలో 1960వ దశకంలో పాకిస్థాన్‌లో జరిగే రన్నింగ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనాలని మిల్కాకు ఆహ్వానం అందింది. అయితే మళ్లీ తాను పాక్‌లో అడుగు పెట్టబోనని మిల్కా అన్నారు. కానీ ప్రధానమంత్రి నెహ్రూ స్వయంగా మిల్కాకు కాల్ చేసి.. పాక్‌లో జరిగే పోటీకి వెళ్లాలని సూచించారు. దీంతో మిల్కా సింగ్ పాక్‌లో జరిగే రన్నింగ్ పోటీకి వెళ్లేందుకు అంగీకరించారు.1958లో టోక్యో ఏషియాడ్‌లో 100 మీటర్ల పరుగును గెలుచుకున్న అబ్దుల్ ఖలిక్‌తో మిల్కాకు ప్రధాన పోటీ జరిగింది. 100మీటర్ల తేడాతో ఖలిక్‌ను మిల్కా ఓడించారు. దీంతో పాక్‌లోని మొత్తం స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించింది. అనంతరం మిల్కాకు బహుమతిని అందజేస్తున్నప్పుడు అప్పటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ అయూబ్ ఖాన్ మిల్కా సింగ్ చెవిలో ఒక మాట అన్నారు.. “నువ్వు ఈరోజు పరుగెత్తలేదు.. ఎగిరిపోయావు” అని గుసగుసగా చెప్పారు. ఆనాటి నుంచే మిల్కా సింగ్‌కు ‘ఫ్లయంగ్ సిఖ్’ అనే(Milkha Singh) పేరొచ్చింది. కాగా, 2021 జూన్ 18న మిల్కా సింగ్ కన్నుమూశారు.