Lawyers Vs ChatGPT : లాయర్లకు ‘ఛాట్ జీపీటీ’ ఝలక్.. నమ్ముకుంటే నట్టేట ముంచుతోందట !
Lawyers Vs ChatGPT : ఛాట్ జీపీటీ (ChatGPT) వినియోగం ఇప్పుడు లాయర్లకు కూడా అలవాటైపోయింది.
- By pasha Published Date - 01:27 PM, Mon - 20 November 23

Lawyers Vs ChatGPT : ఛాట్ జీపీటీ (ChatGPT) వినియోగం ఇప్పుడు లాయర్లకు కూడా అలవాటైపోయింది. పాత కేసుల గురించి స్టడీ చేసేందుకు చాలామంది లాయర్లు ఛాట్ జీపీటీని వాడుతున్నారు. అయితే ఈవిధంగా ఛాట్ జీపీటీపై ఆధారపడుతున్న కొందరు లాయర్లకు చేదు అనుభవం ఎదురవుతోందట. ఛాట్ జీపీటీ చూపిస్తున్న తప్పుడు కేస్ స్టడీలను తమ అఫిడవిట్లలో ప్రస్తావించి.. కొందరు లాయర్లు కేసుల్లో ఓడిపోతున్నారట. ఇలా తరుచూ కేసులు ఓడిపోతున్న లాయర్లను లీగల్ కన్సల్టెన్సీలు జాబ్స్ నుంచి తీసేస్తున్నాయట. ఈ ట్రెండ్ ప్రస్తుతం అమెరికాలో నడుస్తోందంటూ ‘బిజినెస్ ఇన్‌సైడర్’ వెబ్‌సైట్ సంచలన కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించిన కొన్ని కేస్ స్టడీలను కూడా అందులో ప్రస్తావించింది.
We’re now on WhatsApp. Click to Join.
అమెరికాకు చెందిన ఒక యువ న్యాయవాది (జకారియా క్రాబిల్).. కొలరాడోలోని బేకర్ లా గ్రూప్‌లో కన్సల్టెంట్ లాయర్‌గా పనిచేసేవాడు. అతడు ChatGPTని ఉపయోగించాడు. కేస్ స్టడీలు, చట్టాలలోని క్లాజ్‌లు, సెక్షన్ల గురించి ఛాట్ జీపీటీలో వచ్చే సమాచారమంతా సరైనదే అని నమ్మాడు. టైంను సేవ్ చేసుకునేందుకు ఛాట్ జీపీటీ బాగా పనికొస్తుందని విశ్వసించాడు. చివరకు ఆ వివరాలను తన అఫిడవిట్‌లలో ప్రస్తావించి.. వరుసగా ఎన్నో కేసుల్లో ఓడిపోయాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన లా కన్సల్టెన్సీ అతడిని జాబ్ నుంచి తీసేసింది. ఛాట్ జీపీటీ ఇచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మడం వల్ల అతడు మోసపోయాడు. కెరీర్‌లో ఎంతో దెబ్బతిన్నాడు. ఒకవేళ ఛాట్ జీపీటీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనీసం ఒకసారి మరో సోర్స్ ద్వారా చెక్ చేసుకొని ఉంటే.. ఇలాంటి పరిస్థితి యువ లాయర్ జకారియా క్రాబిల్‌కు ఎదురై ఉండేది కాదు. ఇతనొక్కడే కాదు.. ఇలాంటి ఎంతోమంది అమెరికా యువ లాయర్లు ఛాట్ జీపీటీ దెబ్బకు రోడ్డున పడ్డారని ‘బిజినెస్ ఇన్‌సైడర్’ వెబ్‌సైట్ తన కథనంలో (Lawyers Vs ChatGPT) ప్రస్తావించింది.
Also Read: Tollywood: తల్లి పాత్రలకు సై అంటున్న బ్యూటీలు, హద్దులు చెరిపేస్తున్న హీరోయిన్లు
Related News

Crossbeats Nexus: ChatGPT క్రాస్ బీట్స్ నెక్సస్ స్మార్ట్ వాచ్
టెక్నాలజీ రంగంలో అద్భుతంగా పేర్కొంటున్న ChatGPT రిలీజ్ అయి దాదాపు నాలుగు నెలలు పూర్తయింది. దీని సామర్థ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఇది మనిషిలా పని చేస్తుందని సంస్థ చెప్తుంది.