International Tea Day: మే 21న ప్రపంచ టీ దినోత్సవం.. 20 గ్రాముల టీ ఖరీదు 23 లక్షలా?
మనిషి దైనందిన జీవితంలో టీ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇప్పుడంటే సరదాగా స్నేహితులు కలిస్తే అలా సరదాగా ఓ సిప్ వేసొద్దాం అనుకుంటాం.
- By Praveen Aluthuru Published Date - 11:03 PM, Sat - 20 May 23

International Tea Day: మనిషి దైనందిన జీవితంలో టీ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇప్పుడంటే స్నేహితులు కలిస్తే అలా సరదాగా ఓ సిప్ వేసొద్దాం అనుకుంటాం. కానీ మన పూర్వీకులు టీ ని ఎంతో పవిత్రంగా భావించేవారు. ఎవరైనా ఇంటికి వస్తే టీ ఇవ్వనిదే పంపేవారు కాదట. ఇక టీ తాగుతూస్నేహితులు, కుటుంబీకులు ముచ్చట్లు చెప్పుకుంటుంటే ఆహా ఆ ఫీల్ యే వేరు. అంతటి ప్రాధాన్యం ఉన్న టీ దినోత్సవం మే 21న జరుపుకుంటాం. ఆదివారం మే 21న ప్రపంచవ్యాప్తంగా టీ దినోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకుంటారు.
టీ ఖరీదు ఎంత అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఏమిటి? 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 లేదా 500 రూపాయలు. కానీ ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ గురించి తెలుసుకోబోతున్నాం. చైనా యొక్క డా హాంగ్ పావో (Da Hong Pao) (టీ రకం) టీ కిలోగ్రాముకు $1 మిలియన్ కంటే ఎక్కువ ఖర్చవుతుంది. ఇంత గొప్పగా ఇందులో ఏముందని మీరు ఆశ్చర్యపోతున్నారా. వాస్తవానికి ప్రపంచంలో ఈ రకమైన టీ చెట్లు ఆరు మాత్రమే ఉన్నాయి. మదర్ ప్లాంట్‌గా ప్రసిద్ధి చెందిన ఈ చెట్లు చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని వుయి పర్వతాలలో కనిపిస్తాయి. ఇది చివరిగా 2005లో పండించబడింది.
2002లో జరిగిన వేలంలో ఈ టీ కేవలం 20 గ్రాములు మాత్రమే విక్రయించబడింది, ఇది 180,000 యువాన్లు లేదా దాదాపు $28,000 (ప్రస్తుత ధరల ప్రకారం రూ. 23.16 లక్షలు) పలికింది. ఈ టీ అరుదైన కారణంగా జాతీయ సంపదగా ప్రకటించబడింది. మింగ్ రాజవంశం చక్రవర్తి ఈ ప్రత్యేకమైన ఊలాంగ్ టీతో తన తల్లికి చికిత్స చేయాలనుకున్నాడు. ఎందుకంటే దానిలోని ఔషధ గుణాలు తన తల్లికి ఉన్న రోగాన్ని నయం చేయగలవట.
Read More: CSK Playoffs: దర్జాగా ప్లే ఆఫ్‌కు చెన్నై… ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ధోనీసేన

Related News

Chinese Spy : భారత్ లో చైనా మహిళా గూఢచారి.. ప్లాన్ ఏమిటంటే..!
భారత్‌లో ఉన్న టిబెటన్ మత గురువు దలైలామా (Dalai Lama) పై గూఢచర్యం చేసేందుకు చైనా ఓ మహిళను పంపిందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి.