BORG Drinking : బోర్గ్ డ్రింకింగ్ ట్రెండ్.. మత్తు ఉచ్చులో యువత
‘బోర్గ్ డ్రింకింగ్’ ట్రెండ్ ఇప్పుడు అమెరికాలోని కాలేజీలలో జోరుగా నడుస్తోంది.
- By Pasha Published Date - 03:02 PM, Tue - 21 May 24

BORG Drinking : ‘బోర్గ్ డ్రింకింగ్’ ట్రెండ్ ఇప్పుడు అమెరికాలోని కాలేజీలలో జోరుగా నడుస్తోంది. ఈ వ్యసనానికి అలవడి కాలేజీ యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఇంతకీ ఏమిటీ బోర్గ్ ? ఎందుకు యువత దీనికి అలవడుతున్నారు ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
బోర్గ్ అంటే ఏమిటి ?
బోర్గ్ అంటే ఒక పానీయం. గ్యాలన్ మోతాదు (దాదాపు 3.78 లీటర్లు) కలిగిన ప్లాస్టిక్ పాత్రలో వివిధ మిశ్రమాలను కలిపి చేసిన పానీయాన్నే బోర్గ్ అని పిలుస్తున్నారు. బోర్గ్ తయారీలో భాగంగా ఒక గ్యాలన్ నీటి బాటిల్‌ను తీసుకొని, దాన్ని సగం ఖాళీ చేస్తారు. అందులో 750 మిల్లీలీటర్ల వోడ్కాను కలుపుతారు. వోడ్కాలో ఆల్కహాల్ అధిక మోతాదులో ఉంటుంది. ఇందులో ఆల్కహాల్ టేస్టు తెలియకుండా కొన్ని ఫ్లేవర్స్‌ను, ఎలక్ట్రోలైట్ పౌడర్లను మిక్స్ చేస్తారు. ఇవన్నీ కలిస్తే తియ్యటి పానీయం తయారవుతుంది. బోర్గ్ తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరిలో వాంతులు, ఫిట్స్ వంటివి వస్తాయి. కొన్ని సందర్భాల్లో తీవ్ర డీహైడ్రేషన్‌కు కూడా దారితీస్తుంది. ఈ డ్రింక్ ప్రభావంతో దీర్ఘకాలంలో గుండె, మెదడు సంబంధిత సమస్యలు వస్తుంటాయి.
Also Read : Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు : పోలీసులు
బోర్గ్ వ్యసనం.. పేరెంట్స్ ఆందోళన
2022లో అమెరికాలోని కొన్ని కాలేజీలలో ‘బోర్గ్ డ్రింకింగ్’ ట్రెండ్ మొదలైంది. యూత్ పోటాపోటీగా ఈ డ్రింక్‌ను తాగుతూ టిక్ టాక్, ఇతర సోషల్ మీడియాలలో వాటికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌పై యువత తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. తమ పిల్లలు మత్తుకు బానిసలుగా మారుతారేమోనని వారు కలత చెందుతున్నారు. ఈ పరిణామాలతో అలర్ట్ అయిన ప్రభుత్వం కాలేజీల్లో యువతకు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్ సెషన్లను ఏర్పాటు చేస్తోంది.
Also Read :Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. సమన్లు జారీ చేసిన కోర్టు..!
అమెరికా డ్రగ్స్ చట్టంలో కీలక మార్పు
అమెరికాలో మాదకద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. గంజాయిని చట్టబద్ధం చేసే ప్రయత్నాల్లో మొదటి అడుగు పడింది. ఈ క్రమంలోనే గంజాయిని షెడ్యూల్-3 డ్రగ్ నుంచి షెడ్యూల్-1 డ్రగ్ కేటగిరీకి మార్చారు. అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల జాబితాలోకి మార్చారు. గంజాయిని కలిగి ఉన్నా.. లేదా సేవించినా ఇక నుంచి జైలుకేం వెళ్లరు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా చేసిన పోస్ట్ ఇది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఫెడరల్ పాలసీని ప్రతిపాదించినట్లు బైడెన్ ప్రభుత్వం చెబుతోంది.