Gold Bank India : గోల్డ్ బ్యాంక్ ఇండియా.. ఎందుకో తెలుసా ?
ప్రపంచంలోని 5 అతిపెద్ద బ్యాంకుల దగ్గర కూడా లేనంత బంగారం(Gold Bank India) ఎక్కడ ఉందో తెలుసా ?
- By Pasha Published Date - 09:59 AM, Sun - 25 June 23

Gold Bank India : బంగారు గనులు..
ప్రపంచంలో ఎక్కువ బంగారు గనులు చైనాలో ఉన్నాయి.
మన దేశంలో కూడా చాలాచోట్ల ఇవి ఉన్నాయి..
ఇండియా ప్రతి సంవత్సరం 1.6 టన్నుల బంగారాన్ని మైన్స్ నుంచి తీస్తుంది.
ప్రపంచంలోని 5 అతిపెద్ద బ్యాంకుల దగ్గర కూడా లేనంత బంగారం(Gold Bank India) ఎక్కడ ఉందో తెలుసా ? భారతీయ మహిళల దగ్గర ఆభరణాల రూపంలో భారీగా బంగారం నిల్వ ఉంది. ఇది మొత్తం కలిపితే.. ఇంచుమించు 21 వేల టన్నుల బంగారం అవుతుందట. మన దేశంలో అత్యధికంగా బంగారం మైనింగ్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్, హుట్టి, హీరాబుద్దిని గోల్డ్ మైన్స్ లో జరుగుతుంది. 1947 నుంచి 2020 వరకు కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న హట్టి గోల్డ్ మైన్ దాదాపు 84 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. ఈ మైన్ ప్రస్తుతం మన దేశంలోని ఏకైక ముఖ్యమైన బంగారు ఉత్పత్తిదారు.
Also read : Pakistan On PM Modi: ప్రధాని మోదీని మెచ్చుకుంటున్న పాక్ ప్రజలు.. ఎందుకో తెలుసా..?
ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో రామగిరి గోల్డ్ ఫీల్డ్ ఉంది. జార్ఖండ్‌లోని కేంద్రుకోచా గని నుంచి బంగారాన్ని వెలికితీస్తారు. మనదేశంలో ఇంకా 70 టన్నుల బంగారం ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఇందులో 88 శాతం కర్ణాటకలో, 12 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. చాలా తక్కువ మొత్తం (0.1టన్ను కంటే తక్కువ) జార్ఖండ్‌లో ఉంది. మన దేశంలో ఏటా 774 టన్నుల బంగారం సేల్స్ జరుగుతుంటాయి. ఇందులో 80 శాతానికిపైగా విదేశాల నుంచి దిగుమతి అవుతుంది.
Also read : 12 Militants Released : 1500 మంది ముట్టడి.. 12 మంది మణిపూర్ మిలిటెంట్లు రిలీజ్
ముడి బంగారంలో పాదరసం లేదా వెండి ఎక్కువగా ఉంటుంది. బంగారం అనేది కాల్వరైట్, సిల్వనైట్, ప్యాట్జైట్, క్రనైట్ ఖనిజాల రూపంలో కూడా గనులలో లభిస్తుంది. ఒక్కో గనిలో ఒక్కో విధమైన స్వభావం, ఒక్కో విధమైన నాణ్యత కలిగిన గోల్డ్ లభిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తం మీద అన్ని గోల్డ్ మైన్స్ నుంచి దాదాపు 3 వేల టన్నుల బంగారాన్ని వెలికి తీస్తుంటారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో బంగారం తవ్వకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 2 లక్షల టన్నుల బంగారాన్ని వెలికితీశారు. తాజాగా ఒడిశాలోని కియోంఝర్ జిల్లా, మయూర్‌భంజ్, డియోగఢ్ జిల్లాల్లో బంగారు గనులు బయటపడ్డాయి. కియోంజఝర్ జిల్లాలో నాలుగు చోట్ల గనులు బయటపడగా, మయూర్‌భంజ్‌లో నాలుగు, డియోగఢ్ జిల్లాలో ఒక చోట బంగారు గనులను గుర్తించారు.