Global Handwashing Day 2024: మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే
Global Handwashing Day 2024: ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత పరిశుభ్రత, ముఖ్యంగా చేతులను కడుక్కోవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది
- By Sudheer Published Date - 10:27 AM, Tue - 15 October 24

Global Handwashing Day 2024 : ప్రతి రోజుకు ఓ విశేషం ఉంది..కానీ అందరికి ఆ విశేషాలు తెలియవు..కొన్నింటికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ ఆరోజును ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. కాగా ఈరోజు అక్టోబర్ 15 న కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటికీ ఒకటి ‘ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం’ (Global Handwashing Day ) గా ఈరోజు ప్రజలు జరుపుకుంటారు.
ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత పరిశుభ్రత, ముఖ్యంగా చేతులను కడుక్కోవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. 2008లో మొదటిసారి దీనిని (Global Handwashing Day) జరుపుకున్నారు. అప్పటి నుండి ప్రతి ఏడాది అక్టోబర్ 15 న ‘ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం’ (Global Handwashing Day) జరుపుకుంటూ వస్తున్నాం. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (UNICEF) మరియు ఇతర భాగస్వామ్య సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.. ఆరోగ్యం మరియు వ్యాధి నివారణలో కీలకమైన భాగమైన చేతులను శుభ్రంగా కడుక్కోవడమే.
‘ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం’ (Global Handwashing Day) ప్రాముఖ్యత
చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం వల్ల బాక్టీరియా, వైరస్లు మరియు ఇతర హానికర జీవులను తొలిగిపోయి.. అనేక అంటువ్యాధుల నుండి బయటపడతామని.. ముఖ్యంగా COVID-19 మహమ్మారి కాలంలో ఎక్కువగా శుభ్రం చేసుకున్నాం.
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవ (Global Handwashing Day) లక్ష్యాలు:
* వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంచడం.
* చేతులు కడుక్కోవడం అనేది ఆరోగ్యకరమైన జీవన విధానంలో భాగమని ప్రచారం చేయడం.
* విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలు, మరియు కమ్యూనిటీలను పరిశుభ్రతపై చైతన్యం కల్పించడం.
* తల్లిదండ్రులు చిన్నారులకు తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయించడం
* చేతి శుభ్రతపై అవగాహన కల్పించి అంటురోగాలను అరికట్టడం, శుభ్రమైన చేతులే వ్యాధులను నివారించగలవని చెప్పడం
ఈరోజు (Global Handwashing Day) – ప్రభుత్వ కార్యక్రమాలు
* ప్రభుత్వ పాఠశాలల్లో సర్వశిక్ష అభియాన్ ద్వారా చేతులు – పరిశుభ్రత కార్యక్రమం అమలు
* ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా 2015లో మధ్యప్రదేశ్ గిన్నిస్ రికార్డులను నమోదు చేసింది. అక్టోబర్ 15న రాష్ట్రంలోనే 51 జిల్లాల నుంచి 12,76,425 మంది చిన్నారులు చేతులు కడిగే కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించారు.
2024 ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం థీమ్ (Global Handwashing Day 2024 Theme) చూస్తే..
ప్రతి సంవత్సరానికీ ఒక కొత్త థీమ్ ఉంటుంది, దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2024 సంవత్సరానికి థీమ్ “Clean Hands for All” (అందరికీ పరిశుభ్రచేతులు) అని ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రతీ ఒక్కరూ, వయసు, ప్రాంతం, స్థితిగతులను ఎప్పుడూ పట్టించుకోకుండా, పరిశుభ్రత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నదని గుర్తు చేస్తుంది.
Read Also : Bishnoi Gang : లారెన్స్ ముఠాను వాడుకొని ఖలిస్తానీలపై దాడులు.. కెనడా ఆరోపణ