Gaganyaan Mission : ఇవాళ ‘గగన్‌యాన్’ టెస్ట్ ఫ్లైట్.. ఏమిటి ? ఎలా ?
Gaganyaan Mission : ఇంకొన్ని నిమిషాల్లో గగన్‌యాన్ మొట్టమొదటి టెస్ట్ ఫ్లైట్ జరగబోతోంది.
- By Pasha Published Date - 08:37 AM, Sat - 21 October 23
Gaganyaan Mission : ఇవాళ గగన్‌యాన్ మొట్టమొదటి టెస్ట్ ఫ్లైట్ జరగబోతోంది. వాస్తవానికి ఇది 8 గంటలకే జరగాల్సి ఉంది. కానీ ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’ (టీవీ-డీ1) రాకెట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో కౌంట్ డౌన్ టైంను పొడిగించారు. ఈ ప్రయోగంపై స్వయంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ శ్రీహరికోటలో శాస్త్రవేత్తలతో నిరంతరం సమీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు భారత్ చేపడుతున్న గగన్‌యాన్‌లో తొలి అడుగు ఇదే. ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’ (టీవీ-డీ1) అనే ఈ పరీక్ష ద్వారా వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ ఎంతమేరకు సమర్ధంగా ఉంది అనేది టెస్ట్ చేస్తున్నారు. గగన్‌యాన్‌లో భాగంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేముందు ఇస్రో దాదాపు 20 విభిన్న పరీక్షలు నిర్వహించనుంది. వాటిలో మొదటిదే..‘‘ టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్(టీవీ-డీ1)’. ఇందులో భాగంగా క్రూ మాడ్యూల్‌ను టీవీ-డీ1 రాకెట్‌తో ప్రయోగించనున్నారు.ఆ తర్వాత బంగాళాఖాతంలో పారాచూట్ల సాయంతో ల్యాండయ్యే క్రూ మాడ్యూల్‌ను తిరిగి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తారు. ఈ ప్రయోగం మొత్తం సుమారు పది నిమిషాల్లో పూర్తవుతుంది.
ప్రయోగం ఇలా జరుగుతుంది..
- టీవీ–డీ1 రాకెట్ ను 17 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి .. దాని ఎగువ కొన భాగంలో అమర్చిన ‘క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం’ను మళ్లీ కిందకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టడమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం.
- ఈ ప్రయోగంలో రాకెట్ సెకనుకు 400 మీటర్ల వేగంతో దూసుకెళుతుంది. అది నింగిలోకి బయల్దేరాక, అకస్మాత్తుగా వెనక్కి వచ్చే సిగ్నల్స్ ను దానికి ఇస్తారు. దీన్నే ‘అబార్ట్’ మెసేజ్ అంటారు.
- అబార్ట్ మెసేజ్ అందిన వెంటనే రాకెట్ శిఖరభాగంలో అమర్చిన ‘క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం’ విడిపోతుంది. భూమికి 17 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ ఉండగా ఇది జరుగుతుంది.
- విడిగా జర్నీ ప్రారంభించే ‘క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం’ .. దానిలోని 10 ప్యారాచూట్ల సాయంతో శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగాళాఖాతంలో ల్యాండ్ అవుతుంది.
- బంగాళాఖాతంలో అప్పటికే సిద్ధంగా ఉండే కోస్టల్ నేవీ సిబ్బంది ఒక ప్రత్యేక బోట్లో వెళ్లి క్రూమాడ్యూల్ ను సురక్షితంగా రికవర్ చేస్తారు. 531.8 సెకన్లలో ఈ ప్రయోగాన్ని పూర్తి చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
గగన్ యాన్ ఎందుకు ?
- మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం ఇస్రో చేపడుతున్న కార్యక్రమమే గగన్‌యాన్.
- 2025 మార్చినాటికి ముగ్గురు వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో లోఎర్త్ ఆర్బిట్‌లో మూడు రోజులు ఉంచి, సురక్షితంగా భూమి మీదికి తిరిగి తీసుకురావడమే మానవసహిత గగన్ యాన్ ప్రయోగం అంతిమ లక్ష్యం.
- ఈ మిషన్‌లో భాగంగా 20 రకాల విభిన్నమైన పరీక్షలు, 3 మానవ రహిత ప్రయోగాలు కూడా చేయనున్నట్లు ఇస్రో వెల్లడించింది.
- ఈ 20 రకాల పరీక్షల్లో భాగంగానే క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికిల్ ప్రయోగాన్ని ఇవాళ నిర్వహిస్తున్నారు.
- ఈ ప్రయోగాలన్నీ విజయవంతంగా పూర్తయితే 2025లో మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించనున్నారు.
Also Read: Delta Force : ఇజ్రాయెల్‌లో అమెరికా ‘డెల్టా ఫోర్స్’ .. ఏం చేయబోతోంది ?
Related News
Gaganyaan – 48 Sites : ‘గగన్‌యాన్’ వ్యోమగాముల ల్యాండింగ్‌కు 48 సైట్లు.. ఎందుకు ?
Gaganyaan - 48 Sites : గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి పంపేందుకు నలుగురు భారతీయ వ్యోమగాములు రెడీ అయ్యారు.