World Trip in Bus: బస్సులో ప్రపంచ యాత్ర మీకు తెలుసా.. 22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు
ప్రపంచంలోనే అతి సుదీర్ఘ ప్రయాణమిది.. ఒకటీ రెండు కాదు ఏకంగా 56 రోజులపాటు సాగే జర్నీ.. 12 వేల కిలోమీటర్లు.. మధ్యలో 22 దేశాలు చుట్టి వచ్చే యాత్ర.
- Author : Maheswara Rao Nadella
Date : 27-03-2023 - 3:23 IST
Published By : Hashtagu Telugu Desk
World Trip in Bus : ప్రపంచంలోనే అతి సుదీర్ఘ ప్రయాణమిది.. ఒకటీ రెండు కాదు ఏకంగా 56 రోజులపాటు సాగే జర్నీ.. 12 వేల కిలోమీటర్లు.. మధ్యలో 22 దేశాలు చుట్టి వచ్చే యాత్ర (World Trip). అయితే వెళ్లేది విమానంలోనో, నౌకలోనో కానే కాదు. కనీసం రైలులో కూడా కాదు. బస్సులో. నిజంగా బస్సులోనే!!
భారత్ కు చెందిన ప్రముఖ టూర్ ఆపరేటింగ్ కంపెనీ ‘అడ్వెంచర్స్ ఓవర్ లాండ్’ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు రెడీ అయింది. ప్రపంచంలోనే సుదీర్ఘ బస్సు ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ వరకు దాదాపు 12 వేల కిలోమీటర్ల దూరాన్ని 56 రోజుల్లో పూర్తి చేసేందుకు సకల వసతులతో కూడిన ప్రత్యేక లగ్జరీ బస్సును టూర్ కోసం సిద్ధం చేసింది.
ఆగస్టు 7న ఇస్తాంబుల్ నుంచి బయలుదేరనున్న బస్సు అక్టోబరు 1న లండన్ కు చేరుకుంటుందని టూర్ సంస్థ వెల్లడించింది. ఇందులో 30 సీట్లు ఉంటాయి. ఒక్కో టికెట్ రేటును 24,300 డాలర్లు (సుమారుగా రూ.20 లక్షలు) గా నిర్ణయించారు. 22 దేశాల మీదుగా బస్సు జర్నీ సాగుతుంది. బాల్కన్స్, తూర్పు యూరప్, స్కాండినేవియా, పశ్చిమ యూరప్ ప్రాంతాల మీదుగా లండన్ కు చేరుకుంటుంది. ప్రధాన నగరాల్లో బస్సు ఆగినప్పుడల్లా హోటల్స్ లో డబుల్ షేరింగ్ రూమ్స్ కేటాయిస్తారు.
బస్సులో రెండు నెలలు ఎలా పోవాలబ్బా అని ఆలోచించాల్సిన పని లేదు. ఫుల్ లగ్జరీ ఏర్పాట్లు చేశారట. సుదీర్ఘ ప్రయాణానికి అనువుగా ఉండేలా బస్సును డిజైన్ చేశారట. వరల్డ్ టూర్ చేయాలని అనుకునే వాళ్లకు ఇదో మంచి అవకాశం. త్వరపడండి మరి..
Also Read: Free Wi-Fi AC Sleeper Buses: తెలంగాణలో ఉచిత వై – ఫై ఏసీ స్లీపర్ బస్సులు..!