Ambani & Disney India : అంబాని చేతుల్లోకి డిస్నీ ఇండియా..?
డిస్నీ ఇండియాను సొంతం చేసుకునే రేసులో చాలా కంపెనీలు ఉండగా కంపెనీలు చేసిన కోట్ ప్రకారం డిస్నీ ఇండియాను ముఖేష్ అంబాని (Mukesh Ambani) నేతృత్వంలో రిలయన్స్ కొనే అవకాశం ఉందని అంటున్నారు.
- Author : Ramesh
Date : 19-09-2023 - 11:20 IST
Published By : Hashtagu Telugu Desk
Ambani ready to Buy Disney India : అమెరికాకు చెందిన ఎంటర్టైన్మెంట్ సంస్థ డిస్నీ ఇండియా మార్కెట్ లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు సరికొత్త నిర్ణయాలను తీసుకుంది. భారత్ లో డిస్నీ ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో డిస్నీ ఒక ప్రముఖ దిగ్గజ కంపెనీకి సొంతం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. డిస్నీ ఇండియాను సొంతం చేసుకునే రేసులో చాలా కంపెనీలు ఉండగా కంపెనీలు చేసిన కోట్ ప్రకారం డిస్నీ ఇండియాను ముఖేష్ అంబాని (Mukesh Ambani) నేతృత్వంలో రిలయన్స్ కొనే అవకాశం ఉందని అంటున్నారు.
లిస్ట్ లో రిలయన్స్ ముందు వరుసలో ఉంది. డిజిటల్ స్ట్రీకింగ్ లో అడుగుపెట్టిన రిలయన్స్ డిస్నీని కూడా సొంతం చేసుకునే మరింత డెవలప్మెంట్ ఉంటుందని అంటున్నారు. సరైన బేరం దొరికితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్, స్పోర్ట్స్ హక్కులను కూడా విక్రయించేందుకు డిస్నీ రెడీ అయ్యింది. ఇదివరకు డిస్నీ హాట్ స్టార్ ఐపిఎల్ స్ట్రీమింగ్ రైట్స్ కలిగి ఉండగా ఇప్పుడు అది కూడా కోల్పోయింది. ఐపిఎల్ రైట్స్ ను రిలయన్స్ కు చెందిన వయాకాం 18 దక్కించుకుంది.
సో ఎలాగు వయాకాం 18 రిలయన్స్ వారిదే కాబట్టి డిస్నీ హాట్ స్టార్ ని కూడా వారికి ఇస్తే మరింత అభివృద్ధి ఉంటుందని డిస్నీ సంస్థ భావిస్తుంది. వీటికి సంబంధించిన చర్చలు ఇప్పటికే జరుగుతుండగా దీనిపై అఫీషియల్ కన్ ఫర్మేషన్ రవాల్సి ఉందని కొందరు అంటున్నారు. ఐపిఎల్ స్ట్రీమింగ్ తో జియో టీవీకి సబ్ స్క్రైబర్స్ బాగా పెరిగారు. ఈ టైం లో డిస్నీ ఇండియా కూడా రిలయన్స్ సొంతమైతే ఇందులో కూడా రిలయన్స్ నెంబర్ 1 గా నిలిచే అవకాశం ఉంటుంది.
Also Read: Prank Video : అబ్బాయి మరియు అమ్మాయి మధ్య చిలిపి వీడియో తప్పుగా మారింది