HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # IPL 2023
  • # Sri Rama Navami 2023
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄South
  • ⁄Why Actor Rajinikanth Did Not Join Politics Actor Himself Reveals The Reason

Rajinikanth: రాజకీయాలకు దూరమైంది అందుకే.. కారణం చెప్పిన రజనీకాంత్‌..!

ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ (Rajinikanth)​ తన రాజకీయ జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. కిడ్నీ సంబంధిత సమస్యల దృష్ట్యా తాను బహిరంగ సభల్లోనూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్లే రాజకీయాల నుంచి వైదొలిగానని తెలిపారు.

  • By Gopichand Published Date - 09:21 AM, Sun - 12 March 23
Rajinikanth: రాజకీయాలకు దూరమైంది అందుకే.. కారణం చెప్పిన రజనీకాంత్‌..!

ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ (Rajinikanth)​ తన రాజకీయ జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. కిడ్నీ సంబంధిత సమస్యల దృష్ట్యా తాను బహిరంగ సభల్లోనూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్లే రాజకీయాల నుంచి వైదొలిగానని తెలిపారు. ఈ విషయాలన్నీ చెబితే తాను భయపడుతున్నానని అనుకుంటారని, అందుకే ఎక్కడా చెప్పలేదని వివరించారు. శనివారం రాత్రి చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీలో జరిగిన సేఫియన్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ రజతోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి రజనీకాంత్‌ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతున్నప్పుడే రాజకీయ ప్రవేశం చేయాలని అనుకున్నట్లు తెలిపారు.

కానీ బహిరంగ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనరాదని అప్పట్లో వైద్యుడు డాక్టర్‌ రాజన్‌ రవిచంద్రన్‌ సలహా ఇచ్చారని చెప్పారు. ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే జనాలకు కనీసం పది అడుగుల దూరంలో నిలబడి, నిరంతరం మాస్క్ ధరించాలని సూచించారు. కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నప్పుడు కూడా చాలామంది తనకు ఇదే చెప్పారని రజినీ వెల్లడించారు. బహిరంగ సభల్లోనూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్లే రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఆయన తెలిపారు.

Also Read: Drugs : ఢిల్లీలో అంత‌ర్జాతీయ నార్కోటిక్ డ్ర‌గ్ రాకెట్‌ని ఛేదించిన పోలీసులు.. ముగ్గురు అరెస్ట్‌

ఈ విషయాలన్నీ చెబితే తాను భయపడిపోతున్నా అనుకుంటారని, అందుకే ఎక్కడా బయటపెట్టలేదని వివరించారు. ప్రస్తుతం రజనీకాంత్‌ జైలర్ మూవీలో నటిస్తున్నారు. డాక్టర్ మూవీ ఫేమ్ నెల్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జైలర్ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. రజనీకాంత్‌ తన 170వ చిత్ర ప్రకటన కూడా చేశారు. జ్ఞానవేల్ డైరెక్షన్ లో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావొద్దని తాను చెప్పినట్టు గుర్తుచేశారు. ఆ సమయంలో తనను ఆయన అపార్థం చేసుకున్నారని వివరించారు.

Telegram Channel

Tags  

  • covid-19
  • rajinikanth
  • Rajinikanth Health
  • Rajinikanth In Politics
  • Rajinikanth Political Entry
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Supreme Court Orders: కరోనా టైమ్ లో విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు రావాలి.. సుప్రీంకోర్టు

Supreme Court Orders: కరోనా టైమ్ లో విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు రావాలి.. సుప్రీంకోర్టు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి అందరికి తెలిసిందే. కరోనా తీవ్రంగా ఉన్ననాటి రోజులు గుర్తుకు వస్తే ఇప్పటికీ భయమే . కఠినమైన లాక్ డౌన్లు..

  • XBB Corona: కరోనా కొత్త వేరియంట్ “XBB1.16” ఎంత ప్రమాదకరం? 12 దేశాల్లో వ్యాపిస్తున్న ఈ వైరస్ పై డాక్టర్స్ వార్నింగ్

    XBB Corona: కరోనా కొత్త వేరియంట్ “XBB1.16” ఎంత ప్రమాదకరం? 12 దేశాల్లో వ్యాపిస్తున్న ఈ వైరస్ పై డాక్టర్స్ వార్నింగ్

  • Covid 19: దేశవ్యాప్తంగా మరోసారి విజృంభిస్తున్న కోవిడ్.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్?

    Covid 19: దేశవ్యాప్తంగా మరోసారి విజృంభిస్తున్న కోవిడ్.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్?

  • Aishwarya Rajinikanth: ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ.. దొంగతనం చేసింది ఎవరంటే..?

    Aishwarya Rajinikanth: ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ.. దొంగతనం చేసింది ఎవరంటే..?

  • Aishwarya Rajinikanth: రజనీకాంత్ కూతురు ఇంట్లో నగలు చోరీ.. వారిపై కేసు నమోదు..!

    Aishwarya Rajinikanth: రజనీకాంత్ కూతురు ఇంట్లో నగలు చోరీ.. వారిపై కేసు నమోదు..!

Latest News

  • Tripura BJP MLA: అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్యే.. ఎక్కడంటే..?

  • Jagan plan : మూడోసారి క్యాబినెట్ ప్ర‌క్షాళ‌న‌,సీనియ‌ర్ల‌కు ఛాన్స్ ?

  • Philippine Ferry Fire: ఫిలిప్పీన్స్ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం.. 31 మంది మృతి

  • Jagan Delhi : ముగిసిన జ‌గ‌న్ ఢిల్లీ చ‌క్కర్లు, అసెంబ్లీ ర‌ద్దు?

  • Bird Flu: చిలీలో కలకలం.. మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు..!

Trending

    • Business Idea : మీ ఊరిలో ఖాళీ స్థలం ఉందా, ఈ పండ్ల తోటతో నెలకు రూ. 1 లక్ష పక్కా…పెట్టుబడి అవసరం లేదు…!

    • Kuno National Park: 70 ఏళ్ల తరువాత జరిగిన అద్భుతం..4గురు పిల్లలకు తల్లి అయిన సియా..అసలు కథ ఇదే..

    • UPI Payment is Free: అంతా ఏప్రిల్ ఫూల్…యూపీఐ చార్జీల విషయంలో జరిగింది ఇదే…

    • UPI Payments: ఇకపై UPI ద్వారా పేమెంట్స్ చేస్తే మన జేబులు ఖాళీ అవ్వాల్సిందే..!

    • ISRO Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‎న్యూస్ ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..జీతం రూ. 40వేలకే పైనే

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: