HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Villagers In Karnataka Harassed By A Single Crow

Crow Attack: తగ్గేదే లే… అంటున్న ‘కాకి’, పగబట్టి మరీ కొందరిపై దాడి..!

పగలు, ప్రతీకారాలు అనేవి మనుషుల్లోనే ఉన్నాయనుకోకండి సుమీ.. కొన్ని పక్షుల్లోనూ ఉన్నాయని తెలుసుకోండి. సహజంగా అయితే మనుషుల్లోనే ఎక్కువగా రివేంజ్ స్టోరీలను చూస్తూ ఉంటాం. కాకపోతే, ఇప్పుడు పక్షిజాతికి చెందిన దాంట్లోనూ పగను చూడాల్సి వచ్చింది.

  • Author : Hashtag U Date : 30-01-2022 - 10:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
crow
crow

పగలు, ప్రతీకారాలు అనేవి మనుషుల్లోనే ఉన్నాయనుకోకండి సుమీ.. కొన్ని పక్షుల్లోనూ ఉన్నాయని తెలుసుకోండి. సహజంగా అయితే మనుషుల్లోనే ఎక్కువగా రివేంజ్ స్టోరీలను చూస్తూ ఉంటాం. కాకపోతే, ఇప్పుడు పక్షిజాతికి చెందిన దాంట్లోనూ పగను చూడాల్సి వచ్చింది. ఇంతకీ నేను చెబుతున్న పక్షి ఏదో కాదండీ… అదేనండి…ఓ కాకి. అవును… మీరు విన్నది నిజమే. కాకులు కూడా పగబడతాయా..? పగబట్టి అవి ప్రతీకారం తీర్చుకుంటాయా..? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు కర్ణాటకలోని చిత్రదుర్గం తాలూకా ఓబళాపురం గ్రామస్థులు.

ఆ గ్రామంలో కొందరిపై కాకి పగబట్టి మరీ దాడి చేస్తోందని వారు వాపోతున్నారు. దానికి భయపడి ఇంట్లోనుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓబళాపురం గ్రామంలో కొన్ని రోజులుగా సంచరిస్తున్న ఓ ‘కాకి’… ఆ గ్రామంలోని కొందరిని మాత్రమే టార్గెట్ గా చేసుకుందట. వారు ఎంతమందిలో ఉన్నా సరే, ఎగిరొచ్చి మరీ వారిపైనే దాడి చేస్తోందట. దానికున్న గోళ్లతో గీకుతూ, ముక్కుతో పొడుస్తోందని వారు చెబుతున్నారు. మొత్తంమీద ఓబళాపురం విలేజ్ లోని ఏడుగురి పై మాత్రమే, అది పగబట్టి దాడి చేస్తోందని గ్రామస్థులు వెల్లడించారు. పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటున్న ఆ ‘కాకి’ ని గ్రామం నుంచి బయటికి తరిమేసేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. అది వెళ్లడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. అయితే ఆ ‘కాకి’.. ఆ గ్రామంలోని…

ఆ ఏడుగురిపైనే ఎందుకు పగబట్టింది… వారిని మాత్రమే టార్గెట్ గా చేసుకుని ఎందుకు వారిపైనే దాడిచేస్తోందనేది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బహుశా పోయిన జన్మలోనో… లేదంటే ఈ జన్మలోనే దాన్ని ఆ ఏడుగురు ఏమైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఏదిఏమైనా కూడా… ఈ ‘కాకి’ మాత్రం ఓ రేంజ్ లో రివేంజ్ తీసుకుంటుంది కదా…! దీనమ్మ తగ్గేదే..లే అంటోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bharamasagara
  • chitradurga
  • crow menace
  • karnataka
  • Obalapura village

Related News

33 new crest gates for Tungabhadra Dam inaugurated by three Chief Ministers.

Tungabhadra: ముగ్గురు సీఎంల చేతుల మీదుగా తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటకలోని హోసపేటకు చేరుకున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు రూ.51 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన‌నున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభోత్

    Latest News

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd