TVK Vijay Rally in Karur Tragedy : విజయ్ సభలో తొక్కిసలాట..33 మంది మృతి
TVK Vijay Rally in Karur Tragedy : ఈ ఘటనలో ఇప్పటివరకు 33 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. మరణించిన వారిలో 7 మంది చిన్నారులు, 17 మంది మహిళలు, 9 మంది పురుషులు ఉన్నారని ఆయన తెలిపారు.
- By Sudheer Published Date - 11:00 PM, Sat - 27 September 25

తమిళనాడులోని కరూరు(Karur )లో విజయ్ నిర్వహించిన సభ(Vijay Rally)లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. పెద్ద సంఖ్యలో అభిమానులు సభకు తరలివచ్చి పాల్గొనడంతో గందరగోళం నెలకొంది. నియంత్రణ కోల్పోయిన ఈ పరిస్థితిలో తొక్కిసలాట చోటుచేసుకుని అనేక మంది గాయపడగా, సంఘటనాస్థలంలోనే హృదయవిదారక దృశ్యాలు కన్పించాయి. గాయపడిన వారిని వెంటనే కరూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ విషాద వాతావరణం నెలకొంది.
Agarbatti Smoke: అగర్బత్తి, ధూప్‌బత్తి ధూమం ప్రాణాంతకమా? పరిశోధనల్లో కీలక విషయాలు వెల్లడి!
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో ఇప్పటివరకు 33 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. మరణించిన వారిలో 7 మంది చిన్నారులు, 17 మంది మహిళలు, 9 మంది పురుషులు ఉన్నారని ఆయన తెలిపారు. వీరిలో ఎక్కువమంది ఆసుపత్రికి తరలింపులోనే మృతిచెందారని చెప్పారు. ఈ సంఘటనలో గాయపడిన 50 మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, అందరికీ అవసరమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలిపారు.
ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రజలలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. అభిమానుల అధిక హాజరుతో ఏర్పడిన తొక్కిసలాట ఎందుకు నియంత్రణలోకి రాలేదన్న ప్రశ్నలు లేవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సర్కారు, పోలీసు శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తలపతి విజయ్ అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, ప్రభుత్వంపై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.