Lalitha: ప్రముఖ మలయాళ నటి కేపీఏసీ లలిత కన్నుమూత
ప్రముఖ మలయాళ నటి కెపిఎసి లలిత మంగళవారం అర్థరాత్రి త్రిపుణితురలోని తన నివాసంలో కన్నుమూసినట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
- By Hashtag U Published Date - 08:34 AM, Wed - 23 February 22

కొచ్చి: ప్రముఖ మలయాళ నటి కెపిఎసి లలిత మంగళవారం అర్థరాత్రి త్రిపుణితురలోని తన నివాసంలో కన్నుమూసినట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆమె వయస్సు 74 సంవత్సరాలు. ఆమెకు ఒక కుమారుడు నటుడు-దర్శకుడు సిద్ధార్థ్ భరతన్ కుమార్తె శ్రీకుట్టి ఉన్నారు. ఆమె మలయాళ ప్రముఖ దర్శకుడు దివంగత భరతన్‌ను వివాహం చేసుకున్నారు.గత కొన్ని సంవత్సరాలుగా లలిత గత కొన్ని నెలలుగా అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్నారు.
అనేక రకాల పాత్రలను పోషించడంలో ఆమె బహుముఖ ప్రజ్ఞకు పేరుగాంచిన లలిత .. ఐదు దశాబ్దాల క్రితం కేరళలోని ఒక థియేటర్ కలెక్టివ్ KPAC (కేరళ పీపుల్స్ ఆర్ట్స్ క్లబ్)లో థియేటర్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించారు.1969లో కెఎస్ సేతుమాధవన్ దర్శకత్వంలో ‘కూట్టుకుదుంబం’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. లలిత 1970ల చివరలో కొంతకాలం నటనకు విరామం తీసుకున్నారు, కానీ 1983లో భరతన్ దర్శకత్వం వహించిన ‘కట్టాతే కిలిక్కూడు’తో తిరిగి వచ్చారు. ఆమె మృతికి సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆమె తన నటనా నైపుణ్యంతో విభిన్న తరాల హృదయాల్లోకి ఎక్కగలిగారని అన్నారు. ఆమె కేరళ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు.