Crime : సరదాగా పందెం కాసి మైనర్ బాలికపై అత్యాచారం.. వీడియో తీసి పైశాచిక ఆనందం..!!
జార్ఖండ్ లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికకు తానే నిజమైన ప్రేమికుడిగా నిరూపించుకునేందుకు ఓ యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు.
- By hashtagu Published Date - 01:23 PM, Tue - 20 September 22
జార్ఖండ్ లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికకు తానే నిజమైన ప్రేమికుడిగా నిరూపించుకునేందుకు ఓ యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాదు ఆ ఘటనను వీడియో తీసి వైరల్ చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అల్కదిహాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నిందితుడు సంజయ్ భూయాన్ శనివారం రాత్రి ఈ ఘటనకు పాల్పడ్డాడు అని చెప్పారు. తన పక్కింట్లో ఉంటున్న 16 ఏళ్ల మైనర్‌పై అత్యాచారం చేశాడు. అత్యాచారానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన స్నేహితులతో పందెం కాసి..ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ వీడియో వైరల్‌గా మారడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. బాధితురాలి బంధువులు అల్కదిహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… పోక్సో చట్టం కింద కేసు నమోదు జైలుకు తరలించారు.
Related News
Patna News: పాట్నాలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ను ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృతి
బీహార్ రాజధాని పాట్నాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కంకర్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో పనిలో నిమగ్నమై ఉన్న క్రేన్, ఆటో రిక్షా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా దిగ్బ్రాంతికి గురి చేసింది. వివరాలలోకి వెళితే..