Karnataka CM: సీఎం బరిలో డికె శివకుమార్?
కర్ణాటకలో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. ఊహించని రీతిలో కాంగ్రెస్ అఖండ విజయంతో బీజేపీని చిత్తు చేసి సత్తా చాటింది. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సందిగ్దత నెలకొంది
- By Praveen Aluthuru Published Date - 08:36 PM, Sun - 14 May 23

Karnataka CM: కర్ణాటకలో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. ఊహించని రీతిలో కాంగ్రెస్ అఖండ విజయంతో బీజేపీని చిత్తు చేసి సత్తా చాటింది. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమ రాజకీయ ఎత్తుగడలను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక సీఎంపై ఆసక్తి నెలకొంది.
కర్ణాటక ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు బెంగళూరులో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. బెంగళూరులో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి ముందు డికె శివకుమార్ మరియు సిద్ధరామయ్య మద్దతుదారులు నినాదాలతో హోరెత్తించారు. బెంగళూరులోని డికె శివకుమార్ నివాసం వెలుపల ఆయన మద్దతుదారులు గుమిగూడి ‘మాకు డికె శివకుమార్ ముఖ్యమంత్రి కావాలి’ అని నినాదాలు చేశారు. దీంతో కర్ణాటకలో సీఎం పదవిపై మరింత హీట్ పెంచింది.
#WATCH | Huge number of supporters gathers outside the residence of Karnataka Congress president DK Shivakumar in Bengaluru and raise slogans of 'We want DK Shivakumar as CM' pic.twitter.com/wk5u74UWD9
— ANI (@ANI) May 14, 2023
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి ముందు శివకుమార్ తుమకూరులోని నూన్‌వింకెరెలోని శ్రీ కాడసిద్దేశ్వర మఠాన్ని సందర్శించారు. కరిబసవృషభ దేశికేంద్ర ఆశీస్సులు కోరాడు. అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీ కరిబసవ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ మఠం నాకు పవిత్ర స్థలం, స్వామీజీ ఎల్లప్పుడూ నాకు మార్గదర్శకత్వం వహిస్తారని తెలిపారు. గతంలో నాపై ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరిగినప్పుడు కూడా స్వామీజీ నాకు పూర్తి మార్గనిర్దేశం చేశారు. నేను 134 సీట్లు కోరాను ఆ భగవంతుడు అంతకంటే ఎక్కువే ఇచ్చాడని తెలిపారు. కాగా.. శివకుమార్ గాంధీ కుటుంబ విధేయుడు. పార్టీకి ట్రబుల్ షూటర్ గా పేరొందాడు. అతను ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2002లో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావుపై అవిశ్వాస తీర్మానంలో గెలిచాడు.
Read More: RR vs RCB: ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీ కామెంట్స్